LIVE: పద్మ శ్రీ అవార్డుల ప్రదానోత్సవం - ప్రత్యక్ష ప్రసారం - PADMA AWARDS 2026 LIVE
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : May 25, 2026 at 5:29 PM IST
|Updated : May 25, 2026 at 5:56 PM IST
Padma Awards 2026 LIVE: రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం నిర్వహిస్తున్నారు. తొలిదఫా అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేస్తున్నారు. రాష్ట్రపతి భవన్ దర్బార్ హాల్లో సాయంత్రం 5 గంటలకు కార్యక్రమం ప్రారంభమైంది. తొలిదఫాలో 66 మందికి రాష్ట్రపతి అవార్డులు అందజేస్తున్నారు. ఇందులో ఇద్దరికి పద్మ విభూషణ్, ఆరుగురికి పద్మ భూషణ్, 58 మందికి పద్మ శ్రీ అవార్డులు ప్రదానం చేస్తున్నారు. సినీ దిగ్గజం ధర్మేంద్రకు మరణానంతరం, కళల విభాగంలో విశేష కృషి చేసిన ఎన్. రాజంకు పద్మ విభూషణ్లు రాష్ట్రపతి ప్రదానం చేస్తున్నారు. ధర్మేంద్ర తరపున ఆతని భార్య, నటి హేమమాలిని అవార్డు తీసుకున్నారు. ఈరోజు పద్మ అవార్డులను ఐదుగురు తెలుగు ప్రముఖులు అందుకోనున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి అవార్డు గ్రహితలు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ (మరణానంతరం), డాక్టర్ జీవి రావు, దీపిక రెడ్డి, డాక్టర్ పీవీ ఆనంద్ రెడ్డి, వెంపటి కుటుంబ శాస్త్రి. ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ఈటీవీ భారత్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిద్దాం.