LIVE: సీఈసీకి వ్యతిరేకంగా దిల్లీలో విపక్ష ఎంపీల ఆందోళన - ప్రత్యక్షప్రసారం
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : October 7, 2026 at 4:01 PM IST
|Updated : October 7, 2026 at 7:23 PM IST
Opposition MPs Protest Live : దిల్లీలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సీఈసీకి వ్యతిరేకంగా మరోసారి ఆందోళనకు సిద్ధమైన విపక్ష ఎంపీలు జంతర్‌మంతర్ వద్ద ఆందోళన చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఆధ్వర్యంలో విపక్ష ఎంపీలు భేటీకి హాజరయ్యారు. ఎస్‌ఐఆర్, సీఈసీ వ్యవహారంపై సమావేశంలో చర్చించిన విపక్ష ఎంపీలు సమావేశం అనంతరం తదుపరి కార్యాచరణకు సిద్ధమయ్యరు. దిల్లీలో ఎన్నికల సంఘం వైఖరిని నిరసిస్తూ మంగళవారం ఇండీకూటమి నేతలు ఆందోళనకు దిగారు. ముందస్తు అనుమతి లేకుండా ఆకాశవాణి భవన్‌లోకి అక్రమంగా ప్రవేశించారన్న ఆరోపణలతో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ సహా పలువురు ఎంపీలపై కేసు నమోదు చేశారు. ఇవాళ విపక్ష ఎంపీలతో కలిసి జంతర్ మంతర్ వద్దకు ర్యాలీగా వస్తున్నారు. దీంతో జంతర్ మంతర్ వద్ద పోలీసులు అప్రమత్తమయ్యారు. దిల్లీలో విపక్ష ఎంపీల ఆందోళన ర్యాలీని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం