Live: తిరుపతి జిల్లా ముక్కవారిపల్లెలో వీబీ జీరాం జీ ప్రారంభం - ప్రత్యక్షప్రసారం - VB GRAM G LAUNCH AT TIRUPATI
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : July 2, 2026 at 10:59 AM IST
VB-G RAM G Launch at Tirupati District: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన వీబీ జీరాం జీ కార్యక్రమం తిరుపతి జిల్లా ముక్కవారిపల్లె వేదికగా గురువారం ప్రారంభించారు. ఓబులవారిపల్లె మండలం ముక్కవారిపల్లెలో రూ.4.55 లక్షలతో ప్రతిపాదించిన మూడు పనులను కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ప్రారంభించారు. సామాజిక వర్షపునీటి సంరక్షణ కుంట, మ్యాజిక్ డ్రెయిన్, మొక్కల పెంపకం తదితర కార్యక్రమాలు వీటిలో ఉన్నాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనంతపురం జిల్లాలో ప్రారంభించారు. వీబీ జీరాం జీని సైతం రాష్ట్రంలోని తిరుపతి జిల్లా నుంచే కేంద్ర ప్రభుత్వం మొదలు పెట్టింది. రెండేళ్లుగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి పరంగా ఆంధ్రప్రదేశ్ వినూత్న కార్యక్రమాలను అమలుచేస్తోంది. ఉపాధి హామీ పథకం అమలులోనూ జాతీయ స్థాయిలో మెరుగైన పనితీరు కనబరచడంతో కేంద్రం రాష్ట్రానికి అత్యధిక నిధులు కేటాయించింది.