LIVE : హైదరాబాద్​లో ల్యాబ్ టూ సొసైటీ : 'రోల్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ ఇన్ బిల్డింగ్ వికసిత్ భారత్ 2047' జాతీయ సదస్సు - NATIONAL CONFERENCE ON SCIENCE LIVE

🎬 Watch Now: Feature Video

thumbnail
LIVE : హైదరాబాద్​లో ల్యాబ్ టూ సొసైటీ : 'రోల్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ ఇన్ బిల్డింగ్ వికసిత్ భారత్ 2047' జాతీయ సదస్సు (ETV)

By ETV Bharat Andhra Pradesh Team

Published : January 8, 2026 at 9:39 AM IST

|

Updated : January 8, 2026 at 10:02 AM IST

1 Min Read
Choose ETV Bharat

National conference on science Live : అకాడమీ ఫర్‌ సైన్స్, టెక్నాలజీ అండ్‌ కమ్యూనికేషన్‌ (ఏఎస్‌టీసీ), నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఇండియా, (నాసి) - తెలంగాణ అనే సంస్థలు ‘ఈనాడు’తో కలిసి ఇవాళ హైదరాబాద్‌లో జాతీయ సదస్సు నిర్వహిస్తోంది. ‘శాస్త్ర విజ్ఞానాన్ని ప్రయోగశాల నుంచి సమాజంలోకి తీసుకెళ్లడంలో సమాచార పాత్ర - వికసిత్‌ భారత్‌-2047 నిర్మాణం’ అనే ఇతివృత్తంతో బి.ఎం.బిర్లా సైన్స్‌ సెంటర్‌లోని భాస్కర ఆడిటోరియంలో ఈ సదస్సు జరుగుతోంది. శాస్త్రీయ విజ్ఞానాన్ని సమాజంలోకి సమర్థంగా తీసుకెళ్లడంలో సైన్స్‌ ఉపాధ్యాయులు, పరిశోధకులు, విద్యార్థులు, విద్యావేత్తల సమష్టి పాత్రను బలోపేతం చేసి, దేశాభివృద్ధిలో భాగస్వాములయ్యేలా ఈ సదస్సు దోహదపడనుంది.

రక్షణ, అంతరిక్ష, ఆరోగ్య, పోషకాహార రంగాలతో పాటు శాస్త్ర, సాంకేతిక రంగాల్లోని పురోగతిపై నిపుణుల చర్చలుంటాయి. సదస్సుకు మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, ఎం.ఎస్‌.స్వామినాథన్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ డాక్టర్‌ సౌమ్య స్వామినాథన్‌ హాజరయ్యారు. వీటితో పాటు ‘డిస్కవరీ టు డైలాగ్‌: రీఇమాజినింగ్‌ సైన్స్‌ కమ్యూనికేషన్‌ ఫర్‌ ఎ సస్టైనబుల్‌ ఫ్యూచర్‌’ అనే అంశంపై చర్చాగోష్ఠిలో నిపుణులు మాట్లాడనున్నారు. సైన్స్‌ ఉపాధ్యాయులను పరిశోధకులు, కమ్యూనికేటర్లు, నిపుణులతో సమ్మిళితం చేసి సైన్స్‌ను ప్రయోగశాల నుంచి సమాజంలోకి తీసుకురావడమే ముఖ్య ఉద్దేశంగా ఈ సదస్సు జరగనుందని ఏఎస్‌టీసీ కార్యదర్శి సి.ఎల్‌.నరసింహారావు తెలిపారు. 

Last Updated : January 8, 2026 at 10:02 AM IST

ABOUT THE AUTHOR

...view details