అర్ధరాత్రి బస్సులో మంటలు - డ్రైవర్​ అప్రమత్తతతో తప్పిన పెనుప్రమాదం - NALGONDA PRIVATE BUS FIRE ACCIDENT

🎬 Watch Now: Feature Video

thumbnail
అర్ధరాత్రి బస్సులో మంటలు - డ్రైవర్​ అప్రమత్తతతో తప్పిన పెనుప్రమాదం (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : May 30, 2026 at 11:42 AM IST

|

Updated : May 30, 2026 at 12:00 PM IST

1 Min Read
Choose ETV Bharat

Nalgonda Private Bus Fire Accident : నల్గొండ జిల్లా చిట్యాలలోని జాతీయ రహదారి-65పై ప్రైవేట్‌ బస్సులో అగ్నిప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి కాకినాడకు వెళ్తున్న ట్రావెల్స్‌ బస్సులో సాంకేతిక లోపం కారణంగా ఇంజిన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తమై బస్సును రోడ్డు పక్కకు ఆపడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఘటనా సమయంలో బస్సులో సుమారు 36 మంది ప్రయాణికులు ఉన్నప్పటికీ, అందరూ సురక్షితంగా బయటపడ్డారు. 

లగేజీ మొత్తం పూర్తిగా కాలిపోయింది. షార్ట్​ సర్క్యూట్​ వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు బస్సులో మంటలను అదుపులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నించారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది బస్సులో మంటలను ఆర్పారు. అయితే అప్పటికే బస్సు చాలా వరకు దగ్ధమైందని అధికారులు తెలిపారు.

Last Updated : May 30, 2026 at 12:00 PM IST

ABOUT THE AUTHOR

ETV Bharat Telangana holds a significant position in both Telugu-speaking states, Andhra Pradesh and Telangana. Building a strong presence in a specific region requires understanding the preferences and interests of the local population, ETV Bharat has successfully managed to do that in the state. Localised, original content that resonates with the culture, language, and aspirations of the people in the region plays a significant role in achieving this....view details