విద్యార్థులు తెచ్చిన ముందస్తు సంక్రాంతి - సంప్రదాయ వస్త్రధారణలు, డూడూ బసవన్నల విన్యాసాలు - SANKRANTHI CELEBRATIONS IN SCHOOL

🎬 Watch Now: Feature Video

thumbnail
సంక్రాంతి సంబరాలను ముందే తెచ్చిన మురమళ్ళ సాయి స్కూల్ (ETV)

By ETV Bharat Andhra Pradesh Team

Published : January 4, 2026 at 6:15 PM IST

1 Min Read
Choose ETV Bharat

Sankaranthi Festival On School : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సంక్రాంతికి ముందే సందడి నెలకొంది. మురమళ్లసాయి స్కూల్ యాజమాన్యం తమ పిల్లలకు సంక్రాంతి పండుగ విశిష్టతను తెలియజేసేందుకు విద్యార్థిని విద్యార్థులతో పలు కార్యక్రమాలు నిర్వహించింది. హరిదాసుల కథలు, పురాతన కాలంలోమాదిరి పిడకల పొయ్యిపై పరమాన్నం వండండం, పూరి గుడిసెల ప్రభల అలంకరణలు ఆకట్టుకున్నాయి. అనంతరం పాఠశాల యాజమాన్యం భోగి మంటలు వేసి వాటి ప్రాధాన్యాన్ని చిన్నారులకు వివరించింది. చిన్నారులంతా పట్టు పరికిణీలతో, సాంప్రదాయ వస్త్రధారణతో ఆనందంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిన్నారులు రంగురంగుల బెలూన్లు ఎగరవేసి భోగి మంట చుట్టు చేరి ఆడి పాడారు. సంప్రదాయమైన కోడిపందాలను పిల్లలు ఆసక్తిగా తిలకించారు. రెండెడ్ల బండిపై సవారీలు చిన్నారులను ఆకట్టుకున్నాయి. డూడూ బసవన్న విన్యాసాలు, భవిష్యత్తును వివరించే సోదమ్మ ఇలా ప్రతి అంశాన్ని చిన్నారులకు వివరిస్తూ వారితో పండుగ వాతావరణాన్ని సృష్టించారు. ఇలాంటి కార్యక్రమాలు ఇక ముందు కూడా చేస్తే చిన్నారులకు మన సంస్కృతి, సంప్రదాయలపై ఓ అవగాహన ఏర్పడుతుందని చూసిన వారు అభిప్రాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details