బీసీలను చిన్నచూపు చూడటం జగన్‌కు అలవాటే: ఎంపీ చింతకాయల విజయ్‌

🎬 Watch Now: Feature Video

thumbnail
బీసీలను చిన్నచూపు చూడటం జగన్‌కి అలవాటే: ఎంపీ చింతకాయల విజయ్‌ (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 26, 2026 at 2:13 PM IST

1 Min Read
Choose ETV Bharat

MP Chintakayala Vijay on YS Jagan : తమ జీవితాలతో ఆడుకుంటున్న జగన్​ను చెక్​ పెట్టేందుకు బీసీలు ఏకమవుతున్నారని రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్‌ విమర్శించారు. బీసీలను రాజకీయంగా ఉపయోగించుకుని మోసం చేస్తే రాష్ట్రంలో వైఎస్సార్సీపీని లేకుండా చేస్తారని హెచ్చరించారు. చంద్రబాబు వల్లే బీసీ అంటే బ్యాక్‌వర్డ్ క్లాస్‌ నుంచి బ్యాక్‌బోన్ క్లాస్‌గా మారిందన్నారు. 34 శాతం రిజర్వేషన్లు కల్పించి బీసీలను బెస్ట్ క్లాస్‌గా తీర్చిదిద్దుతున్నారని గుర్తు చేశారు. జగన్‌ హయాంలో బీసీ రిజర్వేషన్లను కుదించి దాదాపు 16 వేల మందిని రాజకీయ అవకాశాలకు దూరం చేశారని ధ్వజమెత్తారు. బీసీలపై ఊచకోతలు, టీడీపీ బీసీ నాయకులపై అక్రమ కేసులు వైఎస్సార్సీపీ హయాంలోనే జరిగాయని మండిపడ్డారు. వైఎస్సార్సీపీలో బీసీ నాయకులు బానిస బతుకులు బతికారని, బీసీలను చిన్నచూపు చూడటం జగన్​కు అలవాటేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీకి, బీసీలకు విడదీయరాని బంధం ఉందని, తెలుగుదేశం అంటే తమ పార్టీ అని బడుగు బలహీన వర్గాలు గర్వంగా చెప్పుకుంటున్నాయని చింతకాయల విజయ్‌ అన్నారు.  