వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన, పూర్తిచేసింది చంద్రబాబే : మంత్రి నిమ్మల

🎬 Watch Now: Feature Video

thumbnail
వెలిగొండ ఘనత చంద్రబాబుదే : మంత్రి నిమ్మల (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 31, 2026 at 8:20 PM IST

1 Min Read
Choose ETV Bharat

Nimmala on Veligonda Project : ఎన్నో సవాళ్లను, అవాంతరాలను అధిగమించి వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది, పూర్తిచేసింది చంద్రబాబేనని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, నిర్వాసితులకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు తెలిపారు. వెలిగొండ సాగునీటి ప్రాజెక్టు తొలి దశ ప్రారంభోత్సవ అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రామానాయుడు పాల్గొని మాట్లాడారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వెలిగొండపై సంకల్పించామని నిమ్మల రామానాయుడు గుర్తు చేశారు. రెండేళ్లలో వెలిగొండను పూర్తిచేయాలని మొదటి సమావేశంలోనే సీఎం చంద్రబాబు ఆదేశాలిచ్చారని చెప్పారు. ఈ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి నిరంతర పర్యవేక్షణతో ఎప్పటికప్పుడు సూచనలు చేశారన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రాజెక్టుకు ఆటంకం సృష్టించొద్దని చంద్రబాబు ఆదేశించారని వివరించారు.

గత వైఎస్సార్సీపీ పాలనలో కేవలం ఫొటోలకు పరిమితమై నకిలీ జాతికి అంకితం చేశారని నిమ్మల రామానాయుడు విమర్శించారు. సీఎం చంద్రబాబు ప్రాజెక్ట్‌ పనులు పూర్తి చేసి జలాలు విడుదల చేసి జాతికి అంకితం చేశారని వివరించారు. రెండేళ్లలోనే అత్యంత క్లిష్టమైన టన్నెల్స్‌ పూర్తిచేయడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. ఒక ప్రణాళిక ప్రకారం అన్ని పనులను సకాలంలో చేసుకుంటూ వెళ్లామని చెప్పారు. టన్నెల్‌లో చిక్కుకున్న టీబీఎంను బయటకు తీసుకురావాలని ముందే నిర్ణయించామని, ఫీడర్‌ కాల్వ లైనింగ్‌, రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణ పనులకు లక్ష్యం నిర్దేశించుకున్నామని తెలిపారు. సెప్టెంబర్ 2న గోదావరి వరద జలాలను ఉత్తరాంధ్రకు తీసుకెళ్తున్నామని, 2027లో పోలవరాన్ని పూర్తిచేసి గోదావరి వరద జలాలు రాష్ట్రమంతా తీసుకెళ్తామని నిమ్మల రామానాయుడు వెల్లడించారు.