"నో వెహికల్​ డే" - మండుటెండలో 10 కి.మీ సైకిల్ తొక్కిన మంత్రి నిమ్మల - MINISTER NIMMALA RIDE BICYCLE

🎬 Watch Now: Feature Video

thumbnail
"నో వెహికల్​ డే" - మండుటెండలో 10 కి.మీ సైకిల్ తొక్కిన మంత్రి నిమ్మల (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 15, 2026 at 7:50 PM IST

1 Min Read
Choose ETV Bharat

Minister Nimmala Ride Bicycle on the Occasion of No Vehicle Day : నో వెహికల్ డే (శుక్రవారం) సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు సైకిల్ ఎక్కారు. విజయవాడ క్యాంపు కార్యాలయం నుంచి ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయం వరకు సైకిల్ తొక్కుకుంటూ వచ్చారు. మండుటెండలో దాదాపు 10 కి.మీ సైకిల్ తొక్కుకుంటూ మంత్రి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పోలవరం నిర్వాసితులకు రూ.307 కోట్ల పరిహారం, పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు సైకిల్ పై వచ్చారు. పెట్రోల్, డీజిల్, విద్యుత్ వాడకాన్ని తగ్గించి, పొదుపు చేయాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు తన వంతు బాధ్యతగా కాన్యాయ్​ని పక్కనపెట్టి సైకిల్​ పై మీటింగ్​కు హజరయ్యారు. దేశ భవిష్యత్ కోసం, భవిష్యత్ తరాల కోసం పొదుపు చేయమని ప్రధాని పిలుపు ఇస్తే, వైఎస్సార్సీపీ నేతలు అవహేళనగా మాట్లాడటం బాధాకరమని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.

ప్రధాని మోదీ పిలుపు మేరకు పొదుపు చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం "నో వెహికల్ డే"ను ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్​ తమ కాన్వాయ్ వాహనాలను 50 శాతం తగ్గించుకున్నారు. వారి స్ఫూర్తితో మంత్రులు కొల్లు రవీంద్ర, గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్​రెడ్డి వంటి ప్రజాప్రతినిధులు వారి సొంత కార్లను పక్కనబెట్టారు.

ABOUT THE AUTHOR

ETV Bharat is headquartered in Hyderabad. It holds a very strong position in both the Telugu states. The reach of ETV Bharat Andhra Pradesh has been maximum because of its unique stories. It also has a strong presence in the state and is capable of reaching out to the maximum number of people....view details