LIVE : విశాఖలో 'డిజీ100ఎక్స్ ఏపీ' సదస్సు - పాల్గొన్న మంత్రి లోకేశ్ - ప్రత్యక్షప్రసారం - LOKESH VISAKHAPATNAM LIVE
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : June 12, 2026 at 5:55 PM IST
|Updated : June 12, 2026 at 6:36 PM IST
Minister Lokesh Participated in DG 100 AP conference Live : విశాఖపట్నంలో మంత్రి నారా లోకేశ్ పర్యటిస్తున్నారు. రాడిసన్ బ్లూ రిసార్ట్‌లో జరుగుతున్న 'డిజీ100ఎక్స్ ఏపీ' సదస్సులో మంత్రి లోకేశ్ పాల్గొన్నారు. ఈ పర్యటనలో భాగంగా లోకేశ్ డిజిటల్ టెక్నాలజీ సదస్సులతో పాటు, ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఏఐ ల్యాబ్‌ల (AI Labs) ప్రారంభోత్సవాల్లో కూడా పాలుపంచుకున్నారు. అంతకుముందు ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ‘రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం’ పేరుతో తిరుపతి సమీపంలోని దామినేడులో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మంత్రి లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, ఈ రెండేళ్ల పాలనలో జేసీబీలు, దాడులు, హత్యలు, బూతులు ఏమీలేవన్నారు. "వేంకటేశ్వరస్వామి జోలికి వెళ్లొద్దని నాటి సీఎంను హెచ్చరించా. దేవుడితో పెట్టుకుంటే ఏం జరుగుతుందో ఇవాళ అనుభవిస్తున్నారు. గొడ్డలిపార్టీ అరాచక పాలన చూశాం, ఎన్నో దారుణాలు జరిగాయి. ఒక్క మాస్క్ అడిగినందుకు దళిత వైద్యుడిని చంపేశారు. డ్రైవర్ సుబ్రమణ్యాన్ని చంపేసి డోర్ డెలివరీ చేసిన ఘటన చూశాం.టీడీపీ జెండా లేకుండా చేస్తామని నాడు వైఎస్సార్సీపీ నేతలు అన్నారు. ఇవాళ ప్రజలే వైఎస్సార్సీపీ జెండా పీకేశారు, టీమ్ 11 తీర్పు ఇచ్చారు." అని లోకేశ్ తెలిపారు. ప్రస్తుతం విశాఖ రాడిసన్ బ్లూ రిసార్ట్‌లో జరిగే సదస్సులో మంత్రి లోకేశ్ పాల్గొననున్నారు. ప్రత్యక్షప్రసారం ద్వారా వీక్షిద్దాం.