“అమరావతి రైజింగ్” - జోరుగా రాజధాని నిర్మాణ పనులు - వీడియో షేర్ చేసిన మంత్రి లోకేశ్
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 9, 2026 at 11:08 AM IST
Minister Nara Lokesh Amaravati Night Work Visual Released : నవ్యాంధ్రుల కలల రాజధాని అమరావతి సరికొత్త శోభతో, అద్భుతమైన నిర్మాణ పనుల జోరుతో మరో లెవల్‌కు దూసుకెళ్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో పనులు జోరుగా సాగుతున్నాయి. భారీ క్రేన్లు, మిరుమిట్లు గొలిపే లైట్ల వెలుగుల మధ్య రాత్రి వేళల్లోనూ పనులు జోరుగా జరుగుతున్నాయి. ప్రభుత్వ భవనాల సముదాయ నిర్మాణాలు తుది మెరుగులకు సిద్ధమైన ఈ భవనాలు రాజధాని రూపురేఖలను కళ్లముందు ఆవిష్కరిస్తోంది. ఆధునిక సాంకేతికతతో, అంతర్జాతీయ ప్రమాణాలతో అమరావతి గ్లోబల్ సిటీగా రూపాంతరం చెందుతోంది. “అమరావతి రైజింగ్” అంటూ మంత్రి నారా లోకేశ్ షేర్ చేసిన వీడియో రాజధానిలో పనుల వేగానికి పవర్‌ఫుల్ సిగ్నల్ అనే సంకేతాలిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. డ్రోన్ కెమెరాల ద్వారా రాత్రి వేళల్లో తీసిన ఈ అద్భుతమైన దృశ్యాలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.