Live: దాల్మియా సిమెంట్ ప్లాంట్ విస్తరణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి లోకేశ్ - ప్రత్యక్షప్రసారం - MINISTER LOKESH LIVE
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : July 15, 2026 at 10:56 AM IST
|Updated : July 15, 2026 at 12:44 PM IST
Minister Lokesh at YSR Kadapa District : వైఎస్సార్ కడప జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్ భారీ పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలం చిన్నకొమెర్ల సమీపంలో రూ.3,100 కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్న దాల్మియా సిమెంట్ రెండో ప్లాంట్ విస్తరణ పనులకు ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి లోకేశ్ మాట్లాడుతూ ఈ నూతన ప్లాంట్ ఏర్పాటు ద్వారా రాయలసీమ ప్రాంతంలో పారిశ్రామిక ప్రగతి మరింత వేగవంతం అవుతుందన్నారు. ప్రస్తుత ప్లాంట్ ద్వారా ఇప్పటికే ప్రత్యక్షంగా, పరోక్షంగా 950 మందికి ఉపాధి లభిస్తుండగా, ఈ కొత్త విస్తరణతో అదనంగా మరో 700 మంది నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని స్పష్టం చేశారు. అనంతరం ఆయన ప్రొద్దుటూరు పర్యటనకు బయలుదేరి వెళ్లారు. అక్కడ స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేయనున్నారు.