మంగళగిరి ప్రీమియం లీగ్ క్రికెట్ పోటీల్లో మంత్రి లోకేశ్ సందడి - MINISTER LOKESH PLAYED CRICKET
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 16, 2026 at 10:35 PM IST
Minister Lokesh Flags Off Mangalagiri Premier League Cricket: మంగళగిరి ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి తీరుతానని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల కంటే మరింత ఎక్కువగా అభివృద్ధి చేసి చూపిస్తామని మంత్రి స్పష్టం చేశారు. శుక్రవారం మంగళగిరి ప్రీమియం లీగ్ క్రికెట్ పోటీలలను లోకేశ్ ప్రారంభించారు.
అనంతరం వెంకట్రావు యూత్, ఉండవల్లి లెవెన్స్ మధ్య జరిగిన మ్యాచ్ ను టాస్ వేసి మంత్రి ప్రారంభించారు. ఆ తర్వాత సరదాగా కాసేపు క్రికెట్ ఆడారు. అనంతరం మంగళగిరిలో నూతనంగా ఏర్పాటు చేసిన మగువ వస్త్ర దుకాణాన్ని మంత్రి లోకేశ్ ప్రారంభించారు. తన భార్య బ్రాహ్మణికి, తల్లి భువనేశ్వరి దేవికి మంత్రి లోకేశ్ చీరలు కొనుగోలు చేశారు. తన సొంత నిధులతో ఆధునికీకరించిన పీర్ల సావిడిని మంత్రి ప్రారంభించారు. ముస్లిం పెద్దలతో కలసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. త్వరలోనే భూగర్భ డ్రైనేజీ, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు భూమిపూజ చేస్తామని ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ వెల్లడించారు.
త్వరలోనే అధునాతన రైతు బజారు: రాష్ట్రంలోనే అధునాతన రైతు బజారు త్వరలోనే నిర్మిస్తామని మంత్రి లోకేశ్ వివరించారు. దాదాపు 300 మంది రైతులు నేరుగా తాము పండించిన కూరగాయలను వచ్చి విక్రయించుకోవచ్చని మంత్రి పేర్కొన్నారు. మరోవైపు మంగళగిరి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున శ్మశానాలను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి లోకేశ్ చెప్పారు. గుంటూరు, విజయవాడతో పోల్చుకుంటే 25 శాతం ప్రజల మంగళగిరిలో పెరిగారనీ, దానికి అనుగుణంగా వారికి కావాల్సిన సౌకర్యాలను కల్పిస్తామన్నారు. రాజధాని నేపథ్యంలో మంగళగిరి అభివృద్ధిపైనే అందరూ చర్చించుకుంటున్నారనీ, వారి అంచనాల కంటే ఎక్కువగా చేసి చూపిస్తామని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు.