ముందే వచ్చిన సంక్రాంతి! - వడిసలేరులో ఘనంగా ఎడ్లబండి, గుర్రపు పోటీలు ప్రారంభం - VADISALERU BULLOCK CART RACES
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : December 28, 2025 at 8:06 PM IST
Bullock Cart and Horse Races in East Godavari District : సంక్రాంతి పండుగ వాతావరణాన్ని ముందుగానే తెచ్చేలా మంత్రి కందుల దుర్గేష్ ఎడ్లబండి పోటీలు, గుర్రం పోటీలను ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వడిసలేరులో రాష్ట్రస్థాయిలో ఈ పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. గత ఏడేళ్లుగా పోటీలను నిర్వహిస్తున్న గన్ని భాస్కర్ రావు ఆధ్వర్యంలో ఈసారీ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పోటీల సందర్భంగా మంత్రి దుర్గేష్ గుర్రంపై రావడం ఆకర్షణగా నిలిచింది. ఎడ్లబండ్ల పోటీల విజేతలకు బైక్‌లు, గుర్రం పరుగు పందెం పోటీల విజేతలకు నగదును బహుమతులుగా ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, 2019 నుంచి 2024 వరకు లేనటువంటి పండుగ వాతావరణాన్ని మళ్లీ తీసుకు రావలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. ఈ పోటీలను నిర్వహించిన గన్ని భాస్కర్ రావుకి మంత్రి దుర్గేష్ అందరి తరపున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి ఆసక్తిగా తిలకించారు.