పవన్ కల్యాణ్ పర్యటనతో పుష్కర పనుల్లో వేగం పెరిగింది: మంత్రి దుర్గేష్‌ - DURGESH ON GODAVARI PUSHKARALU

🎬 Watch Now: Feature Video

thumbnail
ప్లాస్టిక్, కాలుష్య రహితంగా పుష్కరాల నిర్వహణ లక్ష్యం : దుర్గేష్‌ (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 27, 2026 at 8:40 PM IST

1 Min Read
Choose ETV Bharat

Durgesh on Godavari Pollution : రాజమహేంద్రవరంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్​ పర్యటనతో పుష్కర పనుల్లో వేగం పెరిగిందని మంత్రి దుర్గేష్‌ పేర్కొన్నారు. ఇందులో భాగంగానే 10 కోట్ల మంది పుణ్య స్నానాలు చేయడమే లక్ష్యంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అదేవిధంగా గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో కాలుష్య నివారణకు పంచాయతీరాజ్ శాఖ ద్వారా రూ.100 కోట్ల నిధులను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్​ కేటాయించినట్లు చెప్పారు.

ఈ క్రమంలోనే మురుగునీటిని, వ్యర్థాలను గోదావరిలోకి  వదిలితే సహించేది లేదని దుర్గేష్​ హెచ్చరించారు. ఎంతటి వారినైనా సరే  జైలుకు పంపుతామని స్పష్టం చేశారు. పరిశ్రమల ఏర్పాటును కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని అయితే దీన్ని ఆసరాగా తీసుకుని ప్రజారోగ్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాజమహేంద్రవరంలో ఆంధ్ర పేపర్ మిల్లు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ కలుషిత నీటిని గోదావరిలో కలుపుతున్నారని చెప్పారు. ఇప్పటికైనా వారు నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు.

మరోవైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్​ ఆదేశాలతో గోదావరిలో కాలుష్య నివారణ కోసం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ సెక్రటరీగా టాస్క్​ఫోర్స్​ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసిందని దుర్గేష్ వివరించారు. పీసీపీ నోడల్ ఏజెన్సీగా ఉంటూ కాలుష్య నివారణకు వెంటనే యాక్షన్ ప్లాన్ అమలు చేస్తుందని తెలిపారు. ఈసారి పుష్కరాలను ప్లాస్టిక్ రహితంగా, కాలుష్య రహితంగా  ఏర్పాటు చేయడమే  కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నంది అవార్డులు ఇస్తామని ప్రకటించారు. ఫిల్మ్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా ఈ అవార్డుల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు దుర్గేష్ పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

ETV Bharat is headquartered in Hyderabad. It holds a very strong position in both the Telugu states. The reach of ETV Bharat Andhra Pradesh has been maximum because of its unique stories. It also has a strong presence in the state and is capable of reaching out to the maximum number of people....view details