చిరంజీవి కుటుంబంపై అభిమానం - పర్చూరు టూ కొండగట్టుకు సైకిల్ యాత్ర - FAN CYCLE YATRA FOR MEGASTAR
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : March 9, 2026 at 5:28 PM IST
Fan Cycle Yatra from Parchur to Kondagattu for Megastar : మెగాస్టార్ చిరంజీవి కుటుంబంపై ఒక అభిమాని తన ప్రేమను చాటుకున్నాడు. వారి శ్రేయస్సు కోరుతూ వినూత్నంగా ఒక కార్యక్రమం చేపట్టాడు. బాపట్ల జిల్లా పర్చూరుకు చెందిన నటరాజ్ శ్రీనివాస్ చిరంజీవికి వీరాభిమాని. మెగా కుటుంబం ఆయురారోగ్యాలతో ఉండాలని పర్చూరు నుంచి కొండగట్టు వరకు ఆయన ప్రత్యేకంగా సైకిల్ యాత్రను ప్రారంభించారు. యాత్రను ప్రారంభించడానికి ముందు శ్రీనివాస్ దంపతులు పర్చూరులోని అభయాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం పర్చూరులో శ్రీనివాస్ తన సైకిల్ యాత్రను మొదలుపెట్టారు. ఈ యాత్ర పర్చూరు నుంచి మొదలై తెలంగాణలోని పుణ్యక్షేత్రమైన కొండగట్టు వరకు సాగుతుంది. కొండగట్టు అంజన్న సన్నిధికి చేరుకున్న తర్వాత అక్కడ కూడా ఆయన ప్రత్యేక పూజలు చేయనున్నారు. మెగా కుటుంబం కోసం ఆంజనేయ స్వామికి మొక్కులు చెల్లించుకోనున్నారు. ఆ తర్వాత శ్రీనివాస్ తన యాత్రను హైదరాబాద్ వైపు మళ్లించనున్నారు. హైదరాబాద్‌లోని మెగాస్టార్ చిరంజీవి నివాసానికి ఆయన వెళ్లనున్నారు. అక్కడ చిరంజీవిని స్వయంగా కలిసి తన యాత్ర విశేషాలను పంచుకుంటారు. అలాగే ఆయన ఆశీస్సులు తీసుకోవాలని శ్రీనివాస్ దృఢంగా సంకల్పించారు. మెగాస్టార్ కుటుంబం ఎల్లప్పుడూ సుఖశాంతులతో ఉండాలన్నదే తన కోరిక అని ఆయన వెల్లడించారు.