LIVE: పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన 'మెగా 158' - ప్రత్యక్షప్రసారం - CHIRU 158 OPENING CEREMONY LIVE
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : May 21, 2026 at 8:14 AM IST
|Updated : May 21, 2026 at 10:21 AM IST
MEGA158 Opening Ceremony Live: మెగాస్టార్ చిరంజీవి 158వ సినిమాకి బాబీ దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. ‘వాల్తేరు వీరయ్య’ విజయం తర్వాత వీళ్లిద్దరి కలయికలో రూపొందనున్న రెండో చిత్రమిది. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె.నారాయణ నిర్మిస్తున్నారు. ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన ఈ సినిమా ఈరోజున పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ మేరకు ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ఈ సినిమాలోని కొత్త లుక్ కోసం పడుతున్న కష్టాన్ని శరీరాకృతిని మార్చుకునేందుకు చేస్తున్న కఠిన కసరత్తుల్ని చిరంజీవి ఓ వీడియోలో చూపించారు. మాస్ అంశాలతో నిండిన శక్తిమంతమైన యాక్షన్ కథతో ఈ సినిమా ముస్తాబు కానుంది. చిరు ఇందులో రెండు కోణాల్లో సాగే పాత్రలో అలరించనున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరు నుంచే రెగ్యులర్ షూట్ మొదలవుతుందని తెలిసింది. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి తెరపైకి వచ్చే అవకాశముంది. చిరంజీవి 158వ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించండి.