మన్యం ప్రాంతంలో 165 కి.మీ ట్రెక్కింగ్ - రూ.110 కోట్లు కేటాయించిన కేంద్రం
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 26, 2026 at 6:43 PM IST
Trekking Adventure Tourism in Manyam : మన్యం ప్రాంతంలో సాహస పర్యాటక ప్రియులకు ఇకపై సందడే సందడి. రాష్ట్రంలోని తూర్పు కనుమల్లో అడ్వెంచర్ టూరిజానికి అడుగులు పడుతున్నాయి. విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాల పరిధిలోని మన్యంలో ట్రెక్కింగ్ కల్చర్‌ను ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారిస్తున్నాయి. వారాంతాల్లో ప్రకృతి ఒడిలో గడపడానికి యువత నుంచి వస్తున్న విపరీతమైన స్పందనే ఈ భారీ నిర్ణయానికి ప్రధాన కారణం. ఏకంగా రూ.110 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో అనంతగిరి నుంచి అరకు వరకు సుమారు 165 కిలోమీటర్ల మేర ట్రెక్కింగ్ మార్గాలను అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్రాంతంలో గంజాయి సాగును నిషేధించిన ప్రభుత్వం గిరిజనులకు ప్రత్యేక ఉపాధి అవకాశాలు కల్పించడానికి కాఫీ తోటలు, పండ్ల తోటల పెంపకంలో పెద్ద ఎత్తున సహాయం చేస్తోంది. ట్రెక్కింగ్ ప్రాంతంలో ఉన్న గిరిజనులు వారు తయారు చేసిన ఉత్పత్తులను అమ్ముకునేలా స్టాల్స్‌ను ఏర్పాటు చేయడానికి అధికారులు ప్రణాళిక రచించారు.