LIVE: రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో మహా శివరాత్రి వేడుకలు - ప్రత్యక్షప్రసారం - MAHASHIVARATRI CELEBRATIONS LIVE
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 15, 2026 at 7:10 AM IST
|Updated : February 15, 2026 at 12:47 PM IST
Mahashivaratri Live: మహా శివరాత్రిని పురస్కరించుకొని ఏపీ వ్యాప్తంగా శివాలయాలన్నీ ముస్తాబయ్యాయి. ముక్కంటిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరటంతో శివాలయాలు కిటకిటలాడుతున్నాయి. ప్రముఖ క్షేత్రాలు, ఆలయాల్లో శివరాత్రి సందర్భంగా జరిగే ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయాల వద్ద అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తిలో విస్తృత బందోబస్తును ఏర్పాటు చేశారు. మొత్తం 1,156 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు సజావుగా దర్శనం జరిగేలా ప్రత్యేక చర్యలను చేపట్టారు. కమాండ్ కంట్రోల్ ద్వారా నిరంతరం పరిస్థితుల పర్యవేక్షిస్తున్నారు. పంచారామ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అమరావతిలో అమరలింగేశ్వర స్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు. భక్తి శ్రద్ధలతో అభిషేకాలు నిర్వహిస్తున్నారు. అమరలింగేశ్వర స్వామి క్షేత్రం శివనామస్మరణతో మార్మోగుతుంది. పెదకాకాని మల్లికార్జున స్వామి ఆలయం భక్తులతో రద్దీగా మారింది. పాలకొల్లు, ద్రాక్షారామంలోనూ తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని శివాలయాలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి.