LIVE : లోక్సభ సమావేశాలు - ప్రత్యక్షప్రసారం - LOK SABHA SESSION LIVE
🎬 Watch Now: Feature Video

Published : February 11, 2026 at 11:01 AM IST
|Updated : February 11, 2026 at 7:09 PM IST
Lok Sabha Session Live : లోక్సభ స్పీకర్ ఓంబిర్లా చేసిన ప్రకటనపై ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఆయనను వెంటనే తొలిగించాలంటూ కాంగ్రెస్ పార్టీ మంగళవారం ఉదయం అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది. లోక్సభలో పరిస్థితులు గందరగోళంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో స్పీకర్ ఓంబిర్లా తనపై విపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చ పూర్తయ్యే వరకు సభకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం ఇవ్వరని గత వారం స్పీకర్ ఓంబిర్లా ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రతిపక్షాలకు చెందిన మహిళా ఎంపీలు దాడికి ప్రయత్నిస్తారనే సమాచారంతో ప్రధానిని సభకు రావొద్దని సూచించినట్లు తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా ఇతర పార్టీల నేతలకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఎంపీలు ఇచ్చిన నోటీసులో పేర్కొన్నారు. ప్రజా సమస్యల ప్రస్తావనకు అవకాశం ఇవ్వకపోవడం బాధించాయని తెలిపారు. ప్రతిపక్ష సభ్యులపై స్పీకర్ చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ పదవిని దుర్వినియోగం చేయడమేనని నోటీసుల్లో వివరించారు. 8 మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేస్తూ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు.