LIVE: లోక్‌సభ సమావేశాలు- ప్రత్యక్ష ప్రసారం - LOK SABHA SPECIAL SESSION LIVE
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : April 17, 2026 at 11:09 AM IST
|Updated : April 17, 2026 at 7:45 PM IST
Lok Sabha Special Session Live: మహిళా రిజర్వేషన్ల చట్టం అమలుకు తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లును, నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన రెండు బిల్లులను గురువారం లోక్‌సభలో కేంద్రం ప్రవేశపెట్టింది. వీటిపై చర్చల్లో ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, బిల్లులను ప్రవేశపెట్టిన కేంద్ర న్యాయశాఖ మంత్రులు, ప్రతిపక్షాలకు చెందిన ప్రియాంకా గాంధీ, అఖిలేశ్ యాదవ్‌లు మాట్లాడారు. ఈ బిల్లులపై ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ జరుగనుంది. ఈ బిల్లులు దేశరాజకీయాలను మలుపుతిప్పే అవకాశాలున్నాయి. ఇక ప్రతిపక్ష ఇండియా కూటమి మాత్రం ఈ బిల్లులపై స్పష్టమైన వైఖరిని ప్రకటించింది. డీలిమిటేషన్ విధానాన్ని వ్యతిరేకిస్తూ రాజ్యాంగ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయాలని నిర్ణయించింది. దీంతో రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందుతుందా? లేక ప్రతిపక్షాల వ్యతిరేకతతో నిలిచిపోతుందా? అన్నది ఉత్కంఠగా మారింది. దీనిపై సభలో పలువురు సభ్యులు ప్రసంగిస్తున్నారు. అందరూ బిల్లులకు మద్దతివ్వాలని అధికార బీజేపీ కోరుతోంది. ఇవాళ మూడు బిల్లులపై చర్చ జరుగుతోంది. సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ జరుగుతోంది. ప్రస్తుతం నేటి లోక్‌సభ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.