ఏడుగురు మత్య్సకారులు సురక్షితం - వారి అనుభవాలపై డాక్యుమెంటరీ: కలెక్టర్​

🎬 Watch Now: Feature Video

thumbnail
మత్య్సకారులు సురక్షితం - వారి అనుభవాలపై డాక్యుమెంటరీ విడుదల చేస్తాం: కలెక్టర్​ (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 27, 2026 at 8:22 PM IST

1 Min Read
Choose ETV Bharat

Konaseema Collector About Missing Fishermen: సముద్రంలో వేటకు వెళ్లి ఎట్టకేలకు ఆచూకీ లభించిన ఏడుగురు మత్స్యకారులను పశ్చిమ బెంగాల్ నుంచి కోనసీమలో వారి ఇళ్లకు చేర్చేందుకు ప్రత్యేక వాహనాన్ని పంపించామని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ వెల్లడించారు. ఈ నెల 3న అల్లవరం మండలం ఓడలరేవు తీరం నుంచి సముద్రంలోకి వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు సురక్షితంగా ఉన్నట్లు కలెక్టర్​ తెలిపారు. బోటులో సాంకేతిక మరమ్మతులు రావడంతో అలలపై పశ్చిమ బెంగాల్ వరకు వెళ్లిపోయిందని ఆయన వివరించారు. 

ఈ నెల 26న పశ్చిమబెంగాలలోని దిగా పోర్టు నుంచి శంకరపూర్ వెళుతున్న అరబింద బార్మిన్ బోటులోని మత్స్యకారులు వీరిని చూసి గుర్తించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వారు ప్రస్తుతం పశ్చిమబెంగాల్​లో బోటు ఓనర్స్ అసోసియేషన్ గెస్ట్ హౌస్​లో విశ్రాంతి తీసుకుంటున్నారని, వారిని ఇక్కడకు ప్రత్యేక వాహనంలో తీసుకొచ్చేందుకు ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్​ను పంపించినట్లు కలెక్టర్​ పేర్కొన్నారు. వారి అనుభవాలతో డాక్యుమెంటరీ విడుదల చేస్తామన్నారు. వాటిని తోటి మత్స్యకారులకు వివరించే విధంగా వచ్చే సోమవారం మధ్యాహ్నం అమలాపురంలోని కలెక్టర్ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తామని కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు.