బాహుబలి కొబ్బరికాయ - బరువు అదిరింది

🎬 Watch Now: Feature Video

thumbnail
కిలో 240 గ్రాముల కొబ్బరికాయ (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 21, 2026 at 3:45 PM IST

1 Min Read
Choose ETV Bharat

Konaseema Ambajipeta Record Heavy Coconut Weighing 1 kg 240 Grams: సాధారణంగా ఒలిచిన కొబ్బరికాయ బరువు 300 గ్రాముల నుంచి 600 గ్రాముల వరకు ఉంటుంది. పెద్దదైతే 800 గ్రాములు ఉంటుంది. వరలక్ష్మీ వ్రతం నేపథ్యంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అంబాజీపేటకు చెందిన దొమ్మేటి అశోక్‌కుమార్‌ తన ఇంటి ఆవరణలోని చెట్టు నుంచి దింపిన కాయలను గురువారం ఒలిచారు. అందులో ఓ కాయ బరువు 1,240 గ్రాములు (కిలోకు పైగా) ఉంది. చెట్టుకు సరైన సమయంలో పోషకాలు అందటం లేదా జన్యుపరమైన మార్పులు జరిగినప్పుడు ఇలాంటి బరువైన కొబ్బరికాయలు వస్తుంటాయని అంబాజీపేట ఉద్యాన పరిశోధన కేంద్రం సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ ఎం. ముత్యాలనాయుడు తెలిపారు.

ఒక కొబ్బరికాయ కిలోకు పైగా ఉందని తెలిసిన స్థానికులంతా దానిని చూసేందుతు తరలి వచ్చారు. సాధారణ కొబ్బరికి భిన్నమైనదిగా అధిక బరువు ఉన్న ఈ కొబ్బరిని చూసిన స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. బాహుబలి కొబ్బరికాయను ఈ వీడియో ద్వారా మీరూ చూసెయ్యండి.