మహిళా పారిశ్రామికవేత్తలు ఆర్థిక వ్యవహారాలపై పట్టు సాధించాలి: కిరణ్ బేడీ

🎬 Watch Now: Feature Video

thumbnail
మహిళా పారిశ్రామికవేత్తలు ఆర్థిక వ్యవహారాలపై పట్టు సాధించాలి : కిరణ్ బేడీ (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 8, 2026 at 8:31 PM IST

1 Min Read
Choose ETV Bharat

Kiran Bedi At FICCI FLO : మహిళా పారిశ్రామికవేత్తలు వ్యాపారంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడంతో పాటు తమ ఆర్థిక వ్యవహారాలపై పూర్తి నియంత్రణ కలిగి ఉండాలని, సొంతంగా ఆర్థిక స్వతంత్రతను కాపాడుకోవాలని పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్, 'ఇండియా విజన్ ఫౌండేషన్' వ్యవస్థాపకురాలు డాక్టర్​ కిరణ్ బేడీ పిలుపునిచ్చారు. 'ఫిక్కీ ఫ్లో' విజయవాడ ఆధ్వర్యంలో నాయకత్వం, నాయకత్వ పటిమ అంశంపై విద్యార్ధినులు, మహిళలు, వివిధ రంగాల మహిళా పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు.  

కనీసం రెండేళ్ల వయస్సు కూడా లేని ఈ విజయవాడ చాప్టర్ ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలు, ఇల్లాళ్లు, వైద్యులు ఒకే వేదికపైకి రావడం అభినందనీయమని కిరణ్​ బేడీ అన్నారు. నేర్చుకోవడానికి, పరస్పరం సహకరించుకోవడానికి నెట్‌వర్కింగ్ ఎంతో కీలకమని తెలిపారు. ఈ చొరవ తీసుకున్న 'ఫిక్కీ ఫ్లో' ప్రతినిధులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ తరం మహిళలు ఇప్పటికే సాంకేతికతపై మంచి అవగాహన కలిగి ఉన్నారని కానీ, వ్యాపారం చేసేటప్పుడు ఆర్థిక వ్యవహారాలను ఇతరులకు అప్పగించకుండా సొంతంగా నిర్వహించుకోవడం, నిర్ణయాధికారాన్ని తమ వద్దే ఉంచుకోవడం చాలా ముఖ్యమని సూచించారు.   

ఇంట్లో పిల్లల మాటలను ఎల్లప్పుడూ శ్రద్ధగా వినాలని సమస్య ఉత్పన్నమయ్యాక స్పందించడం కంటే, దానికి దారితీసే కారణాలను ముందుగానే గుర్తించి నివారించడం చాలా ఉత్తమం అన్నారు. ముందస్తు సన్నాహం, అవగాహన ద్వారానే నేరాలను అరికట్టవచ్చని తెలిపారు. స్థానిక పోలీసులతో కలిసి శిక్షణా కార్యక్రమాలు ప్రారంభించే అంశంపై సానుకూలంగా స్పందించిన కిరణ్‌బేడీ తమ 'ఇండియా విజన్ ఫౌండేషన్' డైరెక్టర్ మోనికా ధావన్, ఫిక్కీ ఫ్లో విజయవాడ ప్రతినిధి సుప్రియ, ఎన్టీఆర్ జిల్లా డీసీపీ కేజీ సరితలతో కలిసి ఒక బృందంగా ఏర్పడతామని చెప్పారు. విజయవాడ లేదా రాజమండ్రి జైలు వ్యవస్థలో ఖైదీల సంక్షేమం, వారి పిల్లల చదువులకై స్పాన్సర్‌షిప్, నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందిస్తామని చెప్పారు.  