కడియం నర్సరీలో న్యూఇయర్ గ్రాండ్ వెల్కమ్ - మొక్కలు, పూల అలంకరణతో వినూత్న స్వాగతం - KADIYAM NURSURIES NEW YEAR
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 1, 2026 at 11:47 AM IST
Kadiyam Nursuries New Year : ప్రతీ నూతన సంవత్సరానికి మొక్కల అలంకరణలతో స్వాగతం పలికే కడియం నర్సరీలు ఈసారి కూడా అదే రీతిలో ముస్తాబయ్యాయి. మొక్కలతో 2026కి స్వాగతం పలుకుతూ వివిధ నర్సరీలు వినూత్నంగా అలంకరణలు చేపట్టారు. కడియంలోని పల్లా వెంకన్న తన నర్సరీని సుమారు లక్ష మొక్కలతో అలంకరించారు. 25 మంది కూలీలు ఐదు రోజులు పాటు శ్రమించి 2026కి స్వాగతం చెబుతూ నర్సరీని అందంగా తీర్చిదిద్దారు. 2026 అందరికి కలసి రావాలని నర్సరీ నిర్వాహకులు కోరారు. ఇందులో మెయిన్ కాన్సెప్ట్ యూనిటీ అండ్ డైవర్సిటీ (భిన్నత్వం , ఏకత్వం ) అని నిర్వాహకులు పల్లా వెంకన్న అన్నారు. భిన్నత్వం అంటే భారతదేశంలో వివిధ మతాలు, భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు, జీవనశైలి వంటివి ఉండటం. ఏకత్వం అంటే ఈ అన్ని తేడాల మధ్య ప్రజలు తమను తాము ఒకే దేశ ప్రజలుగా భావించడం, జాతి సమైక్యతను పాటించడం. యూనిటీ అండ్ డైవర్సిటీ అనేది భారతదేశ ముఖ్యమైన లక్షణం.