వైభవంగా ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాలు - బ్రహ్మగరుడ వాహనంపై స్వామివారి ఊరేగింపు - KADIRI LAKSHMI NARASIMHA TEMPLE

🎬 Watch Now: Feature Video

thumbnail
అంగరంగ వైభవంగా ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాలు - బ్రహ్మగరుడ వాహనంపై స్వామివారి ఊరేగింపు (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : March 5, 2026 at 2:20 PM IST

1 Min Read
Choose ETV Bharat

Kadiri Narasimha Brahma Garuda Seva in Sri Sathya Sai District : శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా బ్రహ్మగరుడ సేవను అంగరంగ వైభవంగా నిర్వహించారు. 

తిరువీధుల్లో బారులు తీరిన భక్తులు: ఈ సందర్భంగా సుగంధ పుష్పాలతో స్వామి వారిని కనుల పండువగా అలంకరించారు. అర్చకులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అలంకార మండపం నుంచి రాజగోపురం వద్దకు స్వామివారిని తీసుకొచ్చి గొడుగులు అమర్చి, పల్లకిలో ఊరేగించారు.  

తనకల్లు మండలం కొక్కంటి నుంచి స్వామి వారి భక్తులు బ్రహ్మ గరుడ సేవ రోజున జగం జ్యోతితో ఉత్సవంలో భక్తులు పాల్గొన్నారు. ఉత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. స్వామివారిని దర్శించుకునేందుకు తిరువీధుల్లో భక్తులు బారులు తీరారు. ఫల పుష్పాలు సమర్పించి, మొక్కులు తీర్చుకున్నారు. ఖాద్రీశుడిని దర్శించుకుని కష్టాలు తీర్చాలని వేడుకున్నారు. ఆలయ ప్రాంగణమంతా భక్తి గీతాలు, మంగళ వాయిద్యాలతో మార్మోగింది. 

ABOUT THE AUTHOR

...view details