కడపలో 'ఆపరేషన్ మోబీ ట్రాక్' - రూ.1.22 కోట్ల విలువైన 610 మొబైల్స్ రికవరీ - LOST PHONES TRACKING KADAPA

🎬 Watch Now: Feature Video

thumbnail
కడపలో రూ.1.22 కోట్ల విలువైన 610 మొబైల్స్ రికవరీ (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : July 8, 2026 at 9:00 PM IST

1 Min Read
Choose ETV Bharat

​Kadapa Mobiles Recovery : కడప జిల్లా పోలీసులు సెల్​ఫోన్ దొంగల భరతం పడుతున్నారు. పోగొట్టుకున్న మొబైల్స్‌ను ట్రేస్ చేసి తిరిగి బాధితులకు అందజేస్తున్నారు. తాజాగా 'ఆపరేషన్ మోబీ ట్రాక్' ద్వారా భారీగా ఫోన్లను రికవరీ చేశారు. పట్టుబడిన 610 మొబైల్ ఫోన్లను మంగళవారం బాధితులకు అప్పగించారు. ఈ మొబైల్స్ విలువ సుమారు రూ.1.22 కోట్లు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఈ వివరాలు తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నెట్‌వర్క్ నిఘా ద్వారా వీటిని గుర్తించినట్లు ఆయన చెప్పారు.

డేటా విశ్లేషణ పద్ధతులను ఉపయోగించి ఈ ఆపరేషన్‌ను విజయవంతం చేశామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 9 విడతల్లో ఫోన్లను రికవరీ చేసినట్లు ఎస్పీ గుర్తు చేశారు. మొత్తంగా చోరీకి గురైన, పోగొట్టుకున్న 6,487 మొబైల్స్‌ను ట్రేస్ చేశామన్నారు. వీటి మొత్తం విలువ ఏకంగా రూ.12.67 కోట్లు ఉంటుందని స్పష్టం చేశారు. ఎవరైనా మొబైల్ పోగొట్టుకుంటే కంగారు పడొద్దని భరోసా ఇచ్చారు. ఫోన్ పోయిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేస్తే వేగంగా వాటిని రికవరీ చేస్తామని ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ప్రజలకు సూచించారు.

ABOUT THE AUTHOR

ETV Bharat is headquartered in Hyderabad. It holds a very strong position in both the Telugu states. The reach of ETV Bharat Andhra Pradesh has been maximum because of its unique stories. It also has a strong presence in the state and is capable of reaching out to the maximum number of people....view details