ఎన్టీఆర్​ జయంతి - తాతకు నివాళులు అర్పించిన జూనియర్​ - NTR BIRTHDAY TRIBUTE AT NTR GHAT

🎬 Watch Now: Feature Video

thumbnail
ఎన్టీఆర్​ జయంతి - నివాళులు అర్పించిన జూనియర్​ ఎన్టీఆర్​ (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : May 28, 2026 at 3:00 PM IST

1 Min Read
Choose ETV Bharat

NTR Birthday Tribute at NTR Ghat : తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఏపీ​ మాజీ సీఎం ఎన్టీఆర్​ జయంతి సందర్భంగా హైదరాబాద్​లోని ఎన్టీఆర్​ ఘాట్​ వద్ద జూనియర్​ ఎన్టీఆర్​ నివాళులు అర్పించారు. అనంతరం కాసేపు అక్కడే కూర్చొని నటుడిగా, నాయకుడిగా సమాజానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ప్రముఖుల రాక నేపథ్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ అనే​ ఈ మూడు అక్షరాల పేరు ఒక ప్రభంజనం, ఒక సంచలనం అని పలువురు కొనియాడారు. ఎన్టీఆర్​ జయంతి సందర్భంగా సినీ నటుడు రాజేంద్రప్రసాద్, మోత్కుపల్లి నర్సింహులు​ నివాళులు అర్పించారు. తెలుగు జాతి ఎక్కడ ఉన్నా అగ్రస్థానంలోకి ఎదగాలని, నందమూరి తారక రామారావు రాజకీయాల్లో మహానాయకుడిగా రాణించారు అంటూ ప్రముఖులు కొనియాడారు. కష్టజీవుల కన్నీళ్లు, అన్నార్తుల ఆకలి నుంచి టీడీపీ పుట్టిందని పేదలకు ఉపయోగపడే పథకాలను ప్రవేశపెట్టారని ప్రముఖలు గుర్తుచేశారు. మరణం లేని జననం ఎన్టీఆర్​దని ఆయన కుమార్తె, రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరి అన్నారు. ఎన్టీఆర్​ 103వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్​ ఘాట్‌లో ఆమె నివాళులర్పించారు.

ABOUT THE AUTHOR

ETV Bharat Telangana holds a significant position in both Telugu-speaking states, Andhra Pradesh and Telangana. Building a strong presence in a specific region requires understanding the preferences and interests of the local population, ETV Bharat has successfully managed to do that in the state. Localised, original content that resonates with the culture, language, and aspirations of the people in the region plays a significant role in achieving this....view details