LIVE: విశాఖ ఆర్కే బీచ్‌లో ఇంటర్నేషనల్ సిటీ పరేడ్, ఆపరేషన్ ఓపెన్ డెమో - ప్రత్యక్షప్రసారం - INTERNATIONAL CITY PARADE
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 18, 2026 at 5:12 PM IST
|Updated : February 18, 2026 at 6:44 PM IST
International City Parade at RK Beach in Visakha Live: అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలో భాగంగా విశాఖలోని ఆర్కే బీచ్ కేంద్రంగా నిర్వహించే సిటీ పరేడ్, నౌకాదళం విన్యాసాలు, ఫైర్, డ్రోన్ షోలకు రంగం సిద్ధమైంది. నేడు నమూనా విన్యాసాలు, రేపు పూర్తిస్థాయి ప్రదర్శనలు నిర్వహించనున్నారు. తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలకు వివిధ దేశాలకు చెందిన యుద్ధ నౌకలు, దేశ, విదేశీ ప్రముఖులు, త్రివిధ దళాలకు చెందిన ఉన్నతాధికారులు హాజరవుతున్న నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. రేపు నిర్వహించే అంతర్జాతీయ సిటీ పరేడ్‌లో అన్ని కార్యక్రమాలను ఇవాళ పూర్తిస్థాయిలో ప్రదర్శిస్తారు. బీచ్ రోడ్డులోని పార్క్ హోటల్ కూడలి నుంచి కోస్టల్ బ్యాటరీ వరకు సాగే ఈ పరేడ్ ను ప్రజలు, అతిథులు చూసేందుకు ఏర్పాట్లు చేశారు. ఎక్కడా తొక్కిసలాటలు జరగకుండా ఇనుప గ్రిల్స్‌తో ఎన్ క్లోజర్లు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా ఆర్కే బీచ్‌లో ఇంటర్నేషనల్ సిటీ పరేడ్, ఆపరేషన్ ఓపెన్ డెమో, ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ ప్రత్యక్షప్రసారం.