LIVE: విశాఖలో ఇంటర్నేషనల్ సిటీ పరేడ్-2026 నావెల్ ఆపరేషన్ డెమో - ప్రత్యక్షప్రసారం - INTERNATIONAL CITY PARADE LIVE

🎬 Watch Now: Feature Video

thumbnail
International_City_Parade (ETV)

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 19, 2026 at 6:19 PM IST

|

Updated : February 19, 2026 at 6:43 PM IST

1 Min Read
Choose ETV Bharat

International City Parade 2026 begins on Visakha: అంతర్జాతీయ యుద్ధనౌకల ఫ్లీట్‌తో సందడిగా మారిన విశాఖలో సిటీ పరేడ్‌ జరుగుతోంది. ఈ కార్యక్రమం కోసం పటిష్ఠ ఏర్పాట్లు చేశారు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సిటీ పరేడ్‌ కోసం బుధవారం నిర్వహించిన రిహార్సల్‌ ఆకట్టుకున్నాయి. డ్రోన్‌షో, లేజర్‌ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భారత్‌ మొదటిసారిగా ఐఎఫ్​ఆర్, మిలాన్‌ను సంయుక్తంగా నిర్వహిస్తూ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నౌకాదళ స్థావరంలో మిలన్‌ - 2026ను ప్రారంభించారు. నౌకాదళ విన్యాసాలు, అంతర్జాతీయ సిటీ పరేడ్​తో విశాఖలో సందడి నెలకొంది. ఆర్కే బీచ్‌లో కొనసాగుతున్న ఈ కార్యక్రమానికి భారీగా ప్రజలు తరలి వచ్చారు. ఈ కార్యక్రమానికి గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ హాజరయ్యారు. బాలికల బృందం చేసిన నృత్యంతో సిటీ పరేడ్ ఉత్సాహభరితంగా ప్రారంభమైంది. NCC కాడెట్లు శక్తి నృత్యం చేశారు. వివిధ బృందాల కవాతు కనువిందు చేసింది. ఎనిమిదికి పైగా దేశాల నుంచి నేవీ బ్యాండుల వాయిద్యం, 45కి పైగా బృందాలతో ఇంటర్నేషనల్ సిటీ పరేడ్, కొరుకొండ స్కూల్ విద్యార్ధుల బృందం, నేవీ చిల్డ్రన్ పాఠశాల బ్యాండు. ఎన్​సిసి, ఎస్​సిసి బృందాల కవాతు ప్రదర్శన ఆకట్టుకున్నాయి. విశాఖ నుంచి ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిద్దాం. 

Last Updated : February 19, 2026 at 6:43 PM IST

ABOUT THE AUTHOR

...view details