LIVE: యుద్ధనౌక 'మహేంద్రగిరి' కమిషనింగ్ వేడుకలో రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ - ప్రత్యక్ష ప్రసారం - RAJNATH SINGH AT VISAKHA LIVE
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : July 11, 2026 at 10:03 AM IST
|Updated : July 11, 2026 at 10:55 AM IST
INS Mahendragiri Commissioned: భారత నౌకాదళం అమ్ములపొదిలోకి మరో శక్తిమంతమైన అస్త్రం చేరనుంది. INS మహేంద్రగిరి యుద్ధనౌకను రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ విశాఖ వేదికగా నౌకాదళ తూర్పు విభాగానికి అంకితం చేశారు. తూర్పు కనుమల్లోని ప్రసిద్ధ పర్వత శ్రేణి పేరును ఈ నౌకకు నామకరణం చేశారు. ఈ ఆరో అధునాతన స్టెల్త్ ఫ్రిగేట్‌ను ఇండియన్ నేవీకి చెందిన వార్‌షిప్ డిజైన్ బ్యూరో రూపొందించగా మజ్‌గాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ నిర్మించింది. ఇందులో 75 శాతానికి పైగా స్వదేశీ పరికరాలనే ఉపయోగించారు.
శత్రువుల రాడార్ల కంటికి చిక్కకుండా తప్పించుకునే స్టెల్త్ ఫీచర్లు, హై-డిగ్రీ ఆటోమేషన్, గాలిలో, నీటిపై, నీటి లోపల అన్నికోణాల్లో దాడులు చేయగల స్వదేశీ ఆయుధాలు, సెన్సార్స్, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సిస్టమ్స్ ఈ నౌక సొంతం. మహేంద్రగిరి కమీషనింగ్ నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నౌకాదళ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు. దేశానికి చెందిన 90 శాతానికి పైగా వాణిజ్యం సముద్రం ద్వారానే జరుగుతోందని, అందుకే దేశ ఆర్థిక వృద్ధికి, ఇంధన భద్రతకు సముద్ర రక్షణ అత్యంత కీలకమని చెప్పారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా యుద్ధ నైపుణ్యాలను పెంచుకోవాలని దిశానిర్దేశం చేశారు. యుద్ధనౌక 'మహేంద్రగిరి' కమిషనింగ్ వేడుక ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.