LIVE: దిల్లీలో ఇండియా- ఏఐ ఇంపాక్ట్ సమిట్‌ - ప్రత్యక్షప్రసారం - INDIA AI IMPACT SUMMIT LIVE

🎬 Watch Now: Feature Video

thumbnail
India AI Impact Summit in Delhi Live (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 19, 2026 at 10:14 AM IST

|

Updated : February 19, 2026 at 10:56 AM IST

1 Min Read
Choose ETV Bharat

India AI Impact Summit in Delhi Live : దేశ రాజధాని దిల్లీ వేదికగా ఇండియా- ఏఐ ఇంపాక్ట్ సమిట్‌ ఘనంగా ప్రారంభమైంది. ఈ నెల 16న ప్రారంభమైన సదస్సు 20వ తేదీ వరకు కొనసాగనుంది. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు బ్రెజిల్‌, ఫ్రాన్స్‌, స్పెయిన్‌, స్విట్జర్లాండ్‌, యూఏఈ తదితర దేశాల నేతలు హాజరయ్యారు. 45కుపైగా దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సదస్సు వేదిక భారత్‌ మండపాన్ని’ కృత్రిమ మేధ ఆధారిత నిఘా, ఆధునిక రక్షణ వ్యవస్థలతో శత్రుదుర్భేద్యంగా మార్చారు. వైమానిక దాడులను అడ్డుకునేందుకు భారత్ మండపం కాంప్లెక్స్‌లో అయిదు యాంటీ డ్రోన్ వ్యవస్థలు, నాలుగు ఎయిర్ డిఫెన్స్ గన్‌లను మోహరించారు. ఉగ్రదాడుల వంటి ఘటనలను తిప్పికొట్టేందుకు ఎన్‌ఎస్‌జీ సహా పలు భద్రతా సంస్థలను రంగంలోకి దించారు. మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ, అంతర్జాతీయ వీవీఐపీల భద్రతా బాధ్యతలను ఎస్పీజీకి అప్పగించారు. సీఐఎస్‌ఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌, సీఆర్పీఎఫ్‌, ఐటీబీపీ బృందాలు భారత మండపం పరిసరాల్లో భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. దిల్లీ వీధుల్లో 10 వేలమందికిపైగా పోలీసులను మోహరించారు.

Last Updated : February 19, 2026 at 10:56 AM IST

ABOUT THE AUTHOR

...view details