విపత్తుల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టం తగ్గించేలా - అగ్నిప్రమాదాలపై మాక్ డ్రిల్ - SAFETY RESCUE OPERATIONS
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : March 13, 2026 at 4:52 PM IST
Safety Precautions in Rescue Operations : ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ వద్ద వేసవి కాలం దృష్ట్యా ఎదురయ్యే అగ్ని ప్రమాదాలు, ఇతర విపత్తుల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించే ఉద్దేశంతో ప్రత్యేక మాక్ డ్రిల్ చేపట్టారు. జిల్లా యంత్రాంగం, ఎన్.డి.ఆర్.ఎఫ్, ఎస్.డి.ఆర్.ఎఫ్, ఫైర్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో సంయుక్తంగా కార్యక్రమం నిర్వహించారు. ప్రమాద సమయాల్లో రెస్క్యూ టీం ఎలా స్పందిస్తుంది? అత్యాధునిక పరికరాలను ఎలా ఉపయోగించాలి? అనే అంశాలపై ప్రత్యక్ష ప్రదర్శన ఏర్పాటు చేశారు. విపత్తు సమయాల్లో భయాందోళనలకు గురి కాకుండా, రెస్క్యూ టీమ్‌లకు ప్రజలు ఎలా సహకరించాలో వివరించారు. కేవలం కలెక్టరేట్ వద్దే కాకుండా ప్రతి నియోజకవర్గం, మండలం, రద్దీగా ఉండే ప్రాంతాలైన షాపింగ్ మాల్స్, మార్కెట్ కాంప్లెక్స్‌లలో కూడా ఇటువంటి డెమోలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
"ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్, ఫైర్ డిపార్ట్‌మెంట్, రెస్క్యూ ఆపరేషన్ల గురించి ప్రజలకు అవగాహన కలిగించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. అత్యవసర సమయాల్లో ప్రజలు రెస్క్యూ టీమ్‌కు ఎలా సహాయపడాలనే విషయాన్ని తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు డెమోలు, మాక్ డ్రిల్ చేయడం వల్ల అవగాహన వస్తే ప్రజలు వైపరీత్యాల సమయాల్లో సురక్షితంగా ఉండగలుగుతారు. ప్రమాదాల సమయాల్లో వాళ్లు జాగ్రత్తగా ఉంటూ, రెస్క్యూటీమ్‌కు ఎలా సహకరించవచ్చో దీని ద్వారా తెలుపుతున్నాం. - లక్ష్మీశ, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్