మహనీయుడి దయ వల్ల పోలవరం మన కళ్ల ముందు సాక్షాత్కారమైంది: హోంమంత్రి అనిత
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : September 2, 2026 at 6:50 PM IST
|Updated : September 2, 2026 at 7:20 PM IST
Home Minister Anitha Speech At PL Puram: మహనీయుడి దయ వల్ల పోలవరం మన కళ్ల ముందు సాక్షాత్కారమైందని హోంమంత్రి అనిత కొనియాడారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం పీఎల్ పురం వద్ద సీఎం చంద్రబాబు రెగ్యులేటర్ ఆన్ చేసి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అనిత మాట్లాడుతూ 5 నెలల క్రితం ఇదే గడ్డపై స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన జరిగిందని తెలిపారు. పాయకరావుపేట వెనుకబడిన నియోజకవర్గం కాదని, ఉత్తరాంధ్ర ప్రజలకు వెన్నెముక అని చాటారు. ఉత్తరాంధ్ర పారిశ్రామిక, వ్యవసాయ రంగానికి ముఖద్వారంగా నిలుస్తోందన్నారు.
గత ప్రభుత్వ హయాంలో పోలవరం నిలుపుదల చేసే పరిస్థితి వచ్చిందని గుర్తు చేశారు. గొడ్డలి పార్టీ నాయకులు అసెంబ్లీలో ప్రగల్భాలు పలికారన్నారు. సీఎం చంద్రబాబు అకుంఠిత దీక్ష వల్లే ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు వచ్చాయన్నారు. చంద్రబాబును అపర భగీరథుడిగా పిలుస్తారన్నారు. కానీ ఆ భగీరథుడు శివ తపస్సు చేసి గంగా జలాన్ని తీసుకువచ్చారని ప్రజలు ఒకే ఒక్క ఓటు చంద్రబాబుకు వేసి గోదావరిని ఉత్తరాంధ్రకు సాధించారన్నారు. పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేయడానికి ఎన్నో రోజులు పట్టదని స్పష్టం చేశారు.