LIVE: 'ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌' 45వ వార్షికోత్సవ వేడుకలు - ప్రత్యక్షప్రసారం - ART OF LIVING CELEBRATIONS LIVE

🎬 Watch Now: Feature Video

thumbnail
Art of Living 45th Anniversary Live (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 20, 2026 at 6:50 PM IST

|

Updated : May 20, 2026 at 8:43 PM IST

1 Min Read
Choose ETV Bharat

Art of Living 45th Anniversary Live : 'ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌' 45వ వార్షికోత్సవ వేడుకలు బెంగళూరులో ఘనంగా జరుగుతున్నాయి. వ్యవస్థాపకుడైన శ్రీశ్రీ రవిశంకర్‌ గురూజీ నేతృత్వంలో ‘ప్రపంచ శాంతి కోసం గ్లోబల్ మెడిటేషన్’ కార్యక్రమం వైభవంగా జరుగుతుంది. ఈ వేడుకల్లో పౌర సమాజంలో నైతిక విలువలపై సదస్సు సంగీత, నృత్య, కళా ఉత్సవాలు ‘అన్‌సంగ్ ఎవరీడే హీరోస్’కు సన్మాన కార్యక్రమాలు, ప్రజాసేవా వ్యవస్థల్లో సుస్థిరమైన విధానాలపై చర్చలు, థీమాటిక్ రౌండ్‌టేబుల్స్ జరుగుతున్నాయి. అలాగే మే 25-26 తేదీల్లో ఖైదీల సంక్షేమం, జైలు విధాన సంస్కరణలపై ప్రత్యేక విధాన చర్చా వేదిక, ఇలా వివిధ అద్భుత కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అయితే బెంగళూరులోని ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌ 45వ వార్షికోత్సవాల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈరోజు సాయంత్రం ఈ కేంద్రానికి చంద్రబాబు చేరుకున్నారు. అక్కడ ధ్యాన కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం ‘వరల్డ్‌ మెడిటేట్స్‌ విత్‌ గురుదేవ్‌ ఫర్‌ గ్లోబల్‌ పీస్‌’ కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ కేంద్రం వ్యవస్థాపకుడైన శ్రీశ్రీరవిశంకర్‌ గురూజీ నేతృత్వంలో నిర్వహించే సత్సంగ్‌లోనూ చంద్రబాబు పాల్గొన్నారు. ఆ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. 

Last Updated : May 20, 2026 at 8:43 PM IST

ABOUT THE AUTHOR

ETV Bharat is headquartered in Hyderabad. It holds a very strong position in both the Telugu states. The reach of ETV Bharat Andhra Pradesh has been maximum because of its unique stories. It also has a strong presence in the state and is capable of reaching out to the maximum number of people....view details