విజయవాడ లోక్ భవన్​లో ఎట్ హోం కార్యక్రమం - హాజరైన సీఎం, హైకోర్టు సీజే, పలువురు ప్రముఖులు

🎬 Watch Now: Feature Video

thumbnail
విజయవాడ లోక్ భవన్​లో ఎట్ హోం కార్యక్రమం (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 16, 2026 at 3:37 PM IST

1 Min Read
Choose ETV Bharat

At Home Program in Vijayawada Lok Bhavan : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్, సమీరా నజీర్‌ దంపతులు శనివారం లోక్‌భవన్‌లో తేనీటి విందు (ఎట్‌ హోం) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ లిసా గిల్‌ దంపతులు హాజరయ్యారు. కార్యక్రమాన్ని తొలిసారిగా వందేమాతరం పూర్తి పాటతోపాటు జాతీయ గీతంతో ప్రారంభించారు. 

గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ఎట్‌ హోం కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు ఒక్కొక్కరి వద్దకు వెళ్లి మర్యాదపూర్వకంగా పలకరించారు. వివిధ క్రీడాంశాల్లో పతకాలు సాధించి వచ్చిన కొందరు క్రీడాకారులను ఆయన అభినందించారు. ఆ పతకాలను వారు గవర్నర్‌కు చూపించి, వాటిని ఆయన చేతుల మీదుగా స్వీకరిస్తూ ఫొటోలు తీసుకున్నారు. గవర్నర్‌ ప్రాంగణమంతా కలియదిరిగి అందరినీ పలకరించారు. అనంతరం ముఖ్యమంత్రి, సీజే ఉన్న టేబుల్‌ వద్దకు వెళ్లి వారితో కూర్చుని మాట్లాడారు. కార్యక్రమంలో పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్ర, ఎంపీ సానా సతీష్, ఎమ్మెల్సీ శ్రీకాంత్, డీజీపీ హరీశ్​కుమార్‌ గుప్తా, ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు.