'లేస్​ ప్యాకెట్​ ఇవ్వండి' - మహిళ మెడలో నుంచి బంగారు ఆభరణాలు దోచుకుని పరారీ

🎬 Watch Now: Feature Video

thumbnail
బైక్​పై వచ్చారు - లేస్​ అడిగారు నక్లెస్​ దోచేశారు (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 26, 2026 at 8:11 PM IST

1 Min Read
Choose ETV Bharat

Gold Jewelry Stolen from Woman In Nellore District: నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని మర్రిపల్లి గ్రామంలో ఓ మహిళ మెడలో నుంచి నాలుగు సవర్ల బంగారు గొలుసును దొంగలు లాక్కెళ్లారు. బాధితురాలు రమాదేవి తెలిపిన వివరాల ప్రకారం ఆమె దుకాణంలో ఉండగా ఇద్దరు బైక్​పై వచ్చారు. వారిలో ఒకరు బైక్ పైనే ఉండగా మరొకరు వచ్చి సిగరెట్లు, వాటర్ ప్యాకెట్లు అడిగి తీసుకున్నారు. ఆ తర్వాత లేస్ ప్యాకెట్ అడిగారు. ఆమె లేస్ ప్యాకెట్​ తీసి ఇచ్చేలోగా మెడలో ఉన్న 32 గ్రాముల పుస్తెలతాడు, కాసులను దుండగులు లాక్కొని బైక్​పై పరారయ్యారు. వెంటనే నిందితుల కోసం గాలించినా ఫలితం దక్కలేదు. చోరీకి గురైన బంగారం విలువ సుమారు రూ. 5 లక్షలు ఉంటుందని బాధితురాలు తెలిపారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పొదలకూరు సీఐ వెంకట్రావు, ఎస్సై శివ రాకేష్​లు ఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 