నెరవేరిన స్వప్నం - ఉత్తరాంధ్రను తాకిన గోదావరి జలాలు

🎬 Watch Now: Feature Video

thumbnail
ఉత్తరాంధ్రను తాకిన గోదావరి జలాలు (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : September 2, 2026 at 1:43 PM IST

1 Min Read
Choose ETV Bharat

Godavari water reaches Polavaram Left Canal : గోదావరి జలాలు ఉత్తరాంధ్రను తాకాయి. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట సమీపంలోని పోలవరం ఎడమ కాలువ క్రాస్ రెగ్యులేటర్ ప్రాంతానికి గోదావరి జలాలు రాత్రికిరాత్రే చేరుకున్నాయి. పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ ద్వారా తూర్పు గోదావరి, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల పరిధిలోని లక్షలాది ఎకరాలకు సాగు, తాగునీటి అవసరాలను తీర్చడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు రూపకల్పన జరిగిందని అధికారులు ఈ సందర్భంగా తెలిపారు. తాజాగా పాయకరావుపేట ప్రాంతంలోని క్రాస్ రెగ్యులేటర్ వద్దకు నీరు చేరుకుంది. ఈ క్రమంలో కాలువ నిర్మాణ పనుల పురోగతి, నీటి ప్రవాహ వేగంపై అధికారులకు ఓ స్పష్టత వచ్చింది. ఈ నేపథ్యంలో గోదారి జలాల రాకతో స్థానిక రైతుల్లో నూతన ఉత్సాహం వ్యక్తమవుతోంది. ఆయకట్టు భూములకు నీటి కష్టాలు తీరతాయని ఈ సందర్భంగా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోని పంటలు కళకళలాడుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.