గిరిజన ప్రాంతాల్లో పుష్యమాసం పండగ సందడి - థింసా నృత్యం చేసిన మహిళలు - GIRIJANA PUSHYA FESTIVAL

🎬 Watch Now: Feature Video

thumbnail
గిరిజన ప్రాంతాల్లో పుష్యమాసం పండగ సందడి - వేడుకల్లో భాగంగా థింసా నృత్యం చేసిన మహిళలు (ETV)

By ETV Bharat Andhra Pradesh Team

Published : January 4, 2026 at 2:32 PM IST

1 Min Read
Choose ETV Bharat

Girijana Pushya Festival at Andhra and Odisha Border: కొండలు, కోనలు, కాకులు దూరని కారడవులు. చెంగుచెంగున దూకే సెలయేళ్లు ఇలాంటి ప్రకృతి రమణీయతను జీవన సారాంశంగా అనుభవిస్తున్న గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలను చూడాలంటే రెండు కళ్లు చాలవు. ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో గిరిజన ప్రాంతాల్లో పుష్యమాసం పండగ సందడి నెలకొంది. వ్యవసాయానికి సంబంధించిన ఈ పండగను వారం పాటు జరుపుకుంటారు. ఏడాదిలోని 12 నెలలు 13 పండగలు గిరిజనులు జరుపుకుంటారు. గిరిజనులు సంస్కృతి, సంప్రదాయలను పాటిస్తూ ప్రత్యేకంగా నిలుస్తున్నారు. ఈ వేడుకల్లో భాగంగా మహిళలు థింసా నృత్యం చేశారు. పురుషులు సంప్రదాయ వాద్యాలతో పాటలు పాడారు. డప్పు దరువులు, డోలు శబ్దాలకు అనుగుణంగా సహజసిద్ధంగా నృత్యాలు చేస్తున్నారు. ఆదివాసీలు ఆచార వ్యవహారాలకు ప్రాధాన్యమిస్తారు. ప్రతి పండగను ఊరంతా కలిసి చేసుకుంటారు. ప్రతి పనికి ముందు పండగ చేస్తుంటారు. ఆదివాసీల ఇంట్లో పెళ్లి జరుగుతోందంటే గూడెం మొత్తం వేడుకే. పండగలను ఊరంతా కలిసి చేస్తారు.  

ABOUT THE AUTHOR

...view details