LIVE: తిరుమలలో శ్రీవారి గరుడవాహన సేవ - ప్రత్యక్షప్రసారం
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : October 16, 2026 at 6:41 PM IST
|Updated : October 16, 2026 at 10:39 PM IST
Tirumala Srivari Brahmotsavam Garuda Vahana Seva: కలియుగ ప్రత్యక్ష దైవం, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత కీలక దశకు చేరుకున్నాయి. ఉత్సవాల్లోనే తలమానికమైన గరుడవాహనంపై స్వామివారిని దర్శించుకునేందుకు తిరుమల క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. ఇవాళ రాత్రి జరిగే గరుడసేవ కోసం అన్ని ఏర్పాట్లు చేశామని టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర తెలిపారు. ఈ నేపథ్యంలో గరుడ సేవకు తిరుపతి జిల్లా పోలీసుశాఖ పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున జిల్లా యంత్రాంగం, టీటీడీ, విజిలెన్స్, ఆర్టీసీ తదితర శాఖలతో సమన్వయం చేసుకుంటూ బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. గరుడ సేవ నేపథ్యంలో శనివారం ఉదయం 6 గంటల వరకు తిరుపతి–తిరుమల ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలకు అనుమతి లేదన్నారు. వాహనదారులకు ఇబ్బంది లేకుండా బాలాజీ లింక్ బస్టాండ్, నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్, ఎస్వీ మెడికల్ కాలేజీ గ్రౌండ్, ఇస్కాన్ గ్రౌండ్‌లో ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేశామన్నారు. అక్కడి నుంచి ఆర్టీసీ బస్సుల్లో తిరుమలకు చేరుకునేలా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా తిరుమల గరుడ వాహన సేవ ప్రత్యక్షప్రసారం.