ప్రమాదవశాత్తు బావిలో పడిపోయిన అడవిదున్న - రక్షించిన అటవీ సిబ్బంది - FOREST STAFF RESCUE WILD BISON
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : May 15, 2026 at 8:00 PM IST
Forest Department Officials Rescue Wild Bison: ప్రమాదవశాత్తు బావిలో పడి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఓ అడవి దున్నను అటవీ శాఖ అధికారులు చాకచక్యంగా రక్షించారు. అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం మంచాల గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని ఒక బావిలో అడవిదున్న పడిపోవడాన్ని గమనించిన స్థానికులు వెంటనే అటవీ శాఖాధికారులకు సమాచారం అందించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రతిపాదించిన 'హనుమాన్ ప్రాజెక్టు' స్ఫూర్తితో అధికారులు తక్షణమే స్పందించారు.
అనకాపల్లి డివిజన్ పరిధిలోని చోడవరం రేంజ్ అధికారుల ఆధ్వర్యంలో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. బావి లోతు ఎక్కువగా ఉండటంతో జేసీబీ యంత్రాన్ని రంగంలోకి దించారు. బావి ప్రహరీ గోడను పాక్షికంగా తొలగించి, మట్టిని వేగంగా తరలించారు. మూగజీవి స్వయంగా పైకి రావడానికి వీలుగా మట్టితో ర్యాంప్‌ను సిద్ధం చేశారు. అధికారుల వ్యూహం ఫలించి, ఆ ర్యాంప్ ద్వారా అడవిదున్న ఎటువంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటకు వచ్చింది. అనంతరం అది అడవి వైపు పరుగులు తీసింది. వన్యప్రాణి ప్రాణాలు కాపాడిన అటవీ సిబ్బందిని గ్రామస్థులు అభినందించారు.