లైసెన్స్ లేదు, నాణ్యత లేదు! - షాకైన ఫుడ్ సేఫ్టీ అధికారులు
🎬 Watch Now: Feature Video

Published : August 28, 2026 at 6:52 PM IST
|Updated : August 28, 2026 at 6:58 PM IST
Inspections By Food Safety Officials : భద్రాచలంలో భారీగా నాసిరకమైన పిల్లలు తినే చిరుతిండ్లను ఫుడ్ సేఫ్టీ అధికారులు పట్టుకున్నారు. కొందరి ఫిర్యాదు మేరకు ఫుడ్ సేఫ్టీ అధికారి శరత్ ఆధ్వర్యంలో పట్టణంలోని నెహ్రూ మార్కెట్లో సుమారు 15 దుకాణాలను తనిఖీలు చేశారు. ఇందులో క్వాలిటీ లేని నాసిరకమైన, ఎలాంటి లైసెన్సులు లేని పిల్లలు తినే చిరుతిండి ప్యాకెట్లు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. వాటన్నింటి శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపించారు. మరోవైపు అనేక దుకాణాలకు లైసెన్సులు లేకపోవడాన్ని అధికారులు గుర్తించారు. ఆహారానికి సంబంధించి వస్తువులను అమ్మే అన్ని దుకాణాలు తప్పనిసరిగా లైసెన్సులు తీసుకోవాలని ఆదేశించారు. చిరుతిండ్ల దుకాణాలతో పాటు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను స్వీట్ షాపులను తనిఖీలు చేశారు. ఆహార భద్రతకు సంబంధించి లేబుల్ లేకుండా భద్రాచలంలో అనేక దుకాణాదారులు ఇలాంటి ప్యాకెట్లను విక్రయిస్తున్నారని గుర్తించారు. వీటన్నిటి శాంపిల్స్ పంపించడం జరుగుతుందని, రిజల్ట్స్ రాగానే వారిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
దుకాణాల్లో నాణ్యత లేని నాసిరకమైన చిరుతిండ్లు అమ్మడం నేరం. దుకాణాల నుంచి శాంపిల్స్ తీసుకున్నాం. వాటిని లాబ్‌కు పంపిస్తాం. తర్వాత చట్టపరమైన చర్యలు తప్పకుండా తీసుకుంటాం. ప్రజలు కూడా ఏదైనా కొనేముందు తేదీ, లైసెన్సు ఉందా, లేదా తెలుసుకొని తీసుకోండి - శరత్, ఫుడ్ సేఫ్టీ అధికారి, భద్రాది కొత్తగూడెం జిల్లా