భద్రాచలం స్నానఘట్టాల వద్ద బురద మేటలు - భక్తుల అవస్థలు

🎬 Watch Now: Feature Video

thumbnail
భద్రాచలం స్నానఘట్టాల వద్ద బురద మేటలు - భక్తుల అవస్థలు (ETV)

By ETV Bharat Telangana Team

Published : September 2, 2026 at 2:51 PM IST

1 Min Read
Choose ETV Bharat

Bathing Place In Bhadrachalam is Muddy : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి పెరిగి, తగ్గడంతో స్నానఘట్టాల ప్రాంతంలో బురద మేటలుగా పేరుకుపోయింది. గోదావరి వరద తగ్గుతుండటంతో బురద భారీగా బయటపడుతోంది. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 20 అడుగుల మేర ప్రవహిస్తోంది. గోదావరి పెరుగుతూ, తగ్గుతూ ఉండటంతో బురద మేటలు భక్తులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. పుణ్యస్నానాలు ఆచరించే భక్తులు, పిండ ప్రదానాలు చేసుకునే వారు గోదావరి నదిలోనికి దిగి స్నానాలు ఆచరించడానికి, పితృ కార్యాలు చేసుకోవడానికి బురద ఇబ్బందిగా మారింది. 

దీంతోపాటు వరదలో కొట్టుకొచ్చిన చెత్తాచెదారం మొత్తం మెట్ల వద్దనే బురదలో చేరి దుర్వాసన వస్తోంది. ప్రధాన గాట్లలో బురదను పంచాయతీ సిబ్బంది మోటార్ల సాయంతో నీళ్లు కొట్టి తొలగిస్తున్నారు. అయినప్పటికీ ప్రధాన ఘాటుకు రెండువైపులా ఉన్న ఘాట్లు మాత్రం బురదమయంగా దర్శనమిస్తున్నాయి. భారీగా ఒండ్రు మట్టి పేరుకుపోవడంతో భక్తులు స్నానాలు ఆచరించడానికి కొంత ప్రదేశాన్ని అధికారులు శుభ్రం చేశారు. ఇంకా చాలా మెట్లపై బురద మేటలు పేరుకుపోయి ఉంది. 