LIVE : అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం - ప్రత్యక్షప్రసారం - FIRE ACCIDENT AT SHOP IN AMEERPET
🎬 Watch Now: Feature Video

Published : June 4, 2026 at 2:04 PM IST
|Updated : June 4, 2026 at 3:33 PM IST
Fire Accident at Shop in Ameerpet Live : హైదరాబాద్ నగరంలో అమీర్‌పేటలోని ఓ దుకాణంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షాపింగ్ కాంప్లెక్స్ రెండో అంతస్తులోని దుకాణంలో మంటలు చెలరేగాయి. అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో ఎంఎస్‌ఆర్ ఫ్యాషన్స్ దుకాణంలో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. మెట్రో పిల్లర్ నంబర్ 1043 వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాద తీవ్రత అధికంగా ఉండటంతో కాంప్లెక్స్‌లోని ఇతర దుకాణాలకూ సైతం మంటలు వ్యాపించాయి. ఇతర దుకాణాల్లోని వారిని ఖాళీ చేయిస్తున్నారు. పోలీస్, ఫైర్, మున్సిపల్, హైడ్రా, ఎస్డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ సిబ్బంది ప్రమాద స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. అమీర్‌పేటలోలోని ప్రధాన రహదారికి సమీపంలోని షాపింగ్ కాంప్లెక్స్ వద్ద ప్రమాదం జరగడంతో ట్రాఫిక్ జామ్ అయింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ప్రాణనష్టం జరిగినట్లుగా సమాచారం లేదు. ఆస్తినష్టం మాత్రం భారీగానే జరిగినట్లుగా తెలుస్తోంది. మంటలు భారీగా వ్యాపించడం, సిటీ నడిబొడ్డున కావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పిల్లల బుక్స్, బట్టల షాపింగ్ కోసం వచ్చిన వారు మంటలను చూసి దిగ్భ్రాంతి చెందారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని సమాచారం. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తరువాతే ప్రమాదానికి కారణాలు, ఆస్తినష్టం వివరాలు తెలిసే అవకాశం ఉంది.