విశాఖ 'సోనోవిజన్'లో అగ్నిప్రమాదం - మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది - FIRE ACCIDENT IN GAJUWAKA
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : April 20, 2026 at 7:34 PM IST
Fire Accident In Sonovision Electronic Showroom At Visakha Distrcit: విశాఖపట్నం గాజువాకలోని సోనోవిజన్ ఎలక్ట్రానిక్ షోరూమ్‌లో సోమవారం అగ్నిప్రమాదం జరిగింది. షోరూమ్‌లోని నాలుగో అంతస్తులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. శ్రీ కన్య థియేటర్ సమీపంలో ఉన్న ఈ షోరూమ్ నాలుగవ అంతస్తులో మంటలు మొదలయ్యాయి. సమాచారం అందుకున్న గాజువాక అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్లతో అక్కడికి చేరుకున్నారు. మంటలను అదుపు చేశారు. జనరేటర్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్నిప్రమాదం జరిగి ఉండొచ్చని సోనోవిజన్ ఎలక్ట్రానిక్ షో రూమ్ యాజమాన్యం భావిస్తోంది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు జరగకపోవడంతో సిబ్బంది, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. సకాలంలో వచ్చి పెద్ద ప్రమాదం నుంచి రక్షించిన అగ్నిమాపక సిబ్బందికి స్థానికులు, నగరవాసుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. ఫైర్ సిబ్బంది కనబరిచిన ధైర్యసాహసాల పట్ల ప్రజలంతా హర్షం వ్యక్తం చేశారు.