మౌంట్ ఎల్‌బ్రోస్‌పై జాతీయ జెండా - ఘనత సాధించిన ఏలూరు ఎస్సై
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 20, 2026 at 12:10 PM IST
Eluru SI Venkateshwar Rao Climbed Mount Everest In Russia : ఏలూరు రూరల్ సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ) వేముల వెంకటేశ్వరరావుకు పర్వతారోహణ అంటే ఒక అభిరుచి. అయినప్పటికీ ఆయన సంప్రదాయ పద్ధతిలో కాకుండా ఒక విలక్షణమైన రీతిలో ఈ అధిరోహణను చేపట్టాలని కోరుకున్నారు. ఈ లక్ష్యంతో, ఆయన ఆగస్టు 15న రష్యాలోని మౌంట్ ఎల్బ్రోస్ను అధిరోహించి, రాష్ట్ర పోలీసు శాఖ జెండాతో పాటు జాతీయ జెండాను కూడా ఎగురవేశారు. ఆయన 5,612 మీటర్ల ఎత్తైన ఆ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించి, ఒక ముఖ్యమైన ఘనతను నమోదు చేశారు. శిఖరాగ్రాన 100 మీటర్ల పొడవైన భారీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, ఆయన 'ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్'లో స్థానం సంపాదించారు. ఆయన ఇప్పుడు భవిష్యత్తులో మౌంట్ ఎవరెస్ట్‌ను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నారు.
ఏలూరులో ఘనస్వాగతం
రష్యాలోని మౌంట్ ఎల్బ్రోస్ శిఖరాన్ని పంద్రాగస్టు రోజున అధిరోహించి వంద మీటర్ల జాతీయ జెండాను రెపరెపలాడించిన ఏలూరు గ్రామీణ ఎస్సై వేముల వెంకటేశ్వరరావు సోమవారం నగరానికి చేరుకున్నారు. స్థానిక రైల్వేస్టేషన్ వద్ద ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఓపెన్ టాప్ కారులో నేరుగా జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయానికి ప్రదర్శనగా చేరుకున్న వెంకటేశ్వరరావును ఎస్పీ ప్రతాప్ శివకిశోర్, ఏఎస్పీ ప్రసాదరావు సత్కరించారు. ఎస్పీ మాట్లాడుతూ మౌంట్ ఎల్బ్రోస్ శిఖరాన్ని అధిరోహించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సాధించిన వెంకటేశ్వరరావు ఘనత పోలీసు శాఖకే గర్వకారణమని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ పోలీసు లోగోతో పాటు డీజీపీ, జిల్లా ఎస్పీ ఫొటోలను శిఖరంపై ప్రదర్శించి రాష్ట్ర పోలీసు శాఖ కీర్తిని ప్రపంచానికి చాటారని ప్రశంసించారు. భవిష్యత్తులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలని ఆకాంక్షించారు. డీఎస్పీ శ్రావణ్ కుమార్, సీఐలు రామకృష్ణ, కోటేశ్వరరావు, ఎస్సైలు నాగబాబు, సుధాకర్, ఎస్సై కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.