బారా షాహీద్‌ దర్గా రొట్టెల పండగ - రెండో రోజూ పోటెత్తిన జనం - SWARNALA CHERUVU ROTI FESTIVAL

🎬 Watch Now: Feature Video

thumbnail
బారా షాహీద్‌ దర్గా రొట్టెల పండగ - రెండో రోజూ పోటెత్తిన జనం (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : June 27, 2026 at 8:38 PM IST

|

Updated : June 27, 2026 at 8:46 PM IST

1 Min Read
Choose ETV Bharat

Devotees Thronged The Venue On The Second Day Of The Rottela Panduga : మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే బారా షాహీద్‌ దర్గా రొట్టెల పండగతో నెల్లూరులో సందడి వాతావరణం నెలకొంది. కోర్కెల రొట్టెల కోసం సుదూర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో స్వర్ణాల చెరువులో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. రెండో రోజు కూడా భక్తజనం పోటెత్తింది. భక్తులు ఎక్కువగా వస్తుండటంతో దర్గాకి వచ్చే దారులన్నీ రద్దీగా మారాయి. భక్తులు క్యూలైన్​లలో గంటల తరబడి వేచి ఉంటూ బారాషాహీదులను దర్శించుకుంటున్నారు. స్వర్ణాల చెరువులో కోర్కెల రొట్టెలు మార్చుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. బారాషాహిదులను దర్శించుకుని, స్వర్ణాల చెరువులో రొట్టెలు పంచుకుంటే కోరిన కోరికలు నెరవేరుతున్నాయని భక్తులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రొట్టెల పండుగను అధికారికంగా నిర్వహిస్తున్నారు. ఈనెల 30 వరకు వివిధ రకాల కార్యక్రమాలు జరగనున్నాయి. "గత ఏడాది మా కుమారుడి కోసం 'సంతానం' 'ఉద్యోగం' కోరుతూ 'రొట్టె'లను తీసుకున్నాం. ఆ కోరికలు అదే ఏడాదిలో నెరవేరాయి. దానికి కృతజ్ఞతగా, మేము ఈ ఉత్సవానికి తిరిగి వచ్చి 12 రొట్టెలను పంపిణీ చేశాం. అలాగే మా ఇంటి శ్రేయస్సు కోసం 'బర్కత్' (అభివృద్ధి/సమృద్ధి) రొట్టెను కూడా తీసుకున్నాము. మాకు అంతా మంచి జరిగింది" అని ఓ భక్తురాలు చెప్పారు

Last Updated : June 27, 2026 at 8:46 PM IST

ABOUT THE AUTHOR

ETV Bharat is headquartered in Hyderabad. It holds a very strong position in both the Telugu states. The reach of ETV Bharat Andhra Pradesh has been maximum because of its unique stories. It also has a strong presence in the state and is capable of reaching out to the maximum number of people....view details