LIVE: ముక్కోటి ఏకాదశి - ఆలయాలకు పోటెత్తిన భక్తులు - MUKKOTI EKADASI
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : December 30, 2025 at 6:49 AM IST
|Updated : December 30, 2025 at 7:32 AM IST
LIVE: మూడు కోట్ల దేవతలు ఒక్కటై మహావిష్ణువును సేవించడానికి తరలివచ్చే తిథి ముక్కోటి ఏకాదశి. వారికోసం ప్రత్యేకంగా తెరచుకునేదే ఉత్తర ద్వారం. ఉత్తర ద్వారం నుంచి ముక్కోటి దేవతలు దేవతార్చనకు తరలివెళ్లే శుభ ఘడియల్లో తామూ ప్రవేశిస్తే వారి అనుగ్రహంతో తమకూ స్వర్గవాస ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. అందుకే, ఉత్తర ద్వారం ద్వారా ఆ మహావిష్ణు రూపాన్ని దర్శించుకునేందుకు, వైష్ణవ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన శ్రీహరి అనుగ్రహం కోసం భక్తకోటి బారులు తీరింది. తిరుమల శ్రీవారి ఆలయంలో తెల్లవారుజామునే ఉత్తర ద్వారాన్ని తెరిచారు. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి శ్రీవారిని దర్శించుకుంటున్నారు. విజయవాడ కనకదుర్గ ఆలయానికి భక్తులు పోటెత్తారు. విశాఖ జిల్లా సింహాచలం పుణ్యక్షేత్రంలో ఉత్తర ద్వార దర్శనం వైభవోపేతంగా ప్రారంభమైంది. సింహాద్రి నాథుడు వైకుంఠ నారాయణుడి అలంకరణలో భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజు తొలి దర్శనం చేసుకున్నారు. అనంతరం భక్తులకు దర్శనాలు కల్పించారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ప్రభుత్వ విప్ పి.గణబాబు స్వామి వారిని దర్శించుకున్నారు. రాష్ట్రంలోని దేవాలయాల్లో వైకుంఠ ఏకాదశి వైభవాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.