LIVE: 'అడవి తల్లి బాట 2.0' కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ - ప్రత్యక్షప్రసారం
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : October 11, 2026 at 10:47 AM IST
|Updated : October 11, 2026 at 12:23 PM IST
Deputy CM Pawan Kalyan Launch Development Programs : లోతట్టులో ఉన్న తమ గ్రామాలకు రోడ్లు నిర్మించాలని దశాబ్దాలుగా అధికారులు, ప్రజాప్రతినిధులను గిరిజనులు వేడుకుంటూనే ఉన్నారు. వారి మొర వినడమే తప్ప స్పందన లేకపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చాక వారి కష్టాలకు తెరదించింది. రహదారుల నిర్మాణంతో పాటు విద్య, వైద్యానికి పెద్దపీట వేసింది. ఇందులో భాగంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ‘అడవితల్లి బాట’ పేరిట రాష్ట్రవ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తూ అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు. రోడ్ల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పటికే అల్లూరి సీతారామరాజు జిల్లాతో పాటు మన్యం జిల్లాలో పవన్ పర్యటించి పక్కా రోడ్లు మంజూరు చేశారు. ఈ క్రమంలో నేడు పోలవరం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.
రంపచోడవరం మండలంలోని కాకవాడ-వేములకొండ మధ్య 2.5 కిలోమీటర్ల మేర 20 ఏళ్ల క్రితం కంకర రోడ్డు నిర్మించారు. ప్రస్తుతం కంకరతేలి, గుంతలమయంగా మారి రాకపోకలు సాగించలేని దుస్థితిలో ఉంది. దీనిని బాగు చేయించాలని గిరిజనులు కొన్నేళ్లుగా యంత్రాంగానికి వినతులిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పర్యటనతో ఈ రోడ్డుకు మోక్షం కలగనుంది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ పర్యటన ప్రత్యక్షప్రసారం.