LIVE : తెలంగాణ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ - ప్రత్యక్ష ప్రసారం - TELANGANA PANCHAYAT ELECTIONS 2025

🎬 Watch Now: Feature Video

thumbnail
Telangana Panchayat Elections 2025 (Eenadu)

By ETV Bharat Telangana Team

Published : December 11, 2025 at 1:46 PM IST

|

Updated : December 11, 2025 at 9:11 PM IST

1 Min Read
Choose ETV Bharat

Debate on Telangana Panchayat Elections 2025 : తెలంగాణ వ్యాప్తంగా తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. 3,834 గ్రామాల్లో సర్పంచ్​, 27,678 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ జరిగింది. ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చారు. ఉదయం 7 గంటల నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసేందుకు అన్ని చోట్ల ఓటర్లు బారులు తీరారు. చలిలో చంటి పిల్లలతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చారు. వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు అంబులెన్స్​లో వచ్చారు. దీంతో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 9 గంటల వరకు 19.58 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఉపాధి కోసం నగరాలు, పట్టణాల్లో ఉన్న ఓటర్లు స్వస్థలాలకు చేరుకుంటున్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పోలింగ్‌ను అధికారులు పర్యవేక్షించారు. ఎన్నికలు ముగియడంతో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. సర్పంచ్​ పదవిని ఎవరు దక్కించుకున్నారన్నేది సాయంత్రానికల్లా తెలిసిపోతుంది.

Last Updated : December 11, 2025 at 9:11 PM IST

ABOUT THE AUTHOR

...view details